రష్మిక మందన్న(Rashmika Mandanna)- శ్రీలీల(Sreeleela). ఇద్దరూ ఇద్దరే! ఇద్దరూ వరుస సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. స్టార్‌ హీరోలతో నటిస్తూ అగ్రపథంలో దూసుకుపోతున్నారు. శ్రీలీల కంటే రష్మిక కొంచెం సీనియర్‌. అయినా వీరిద్దరి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. దర్శక, నిర్మాతలు కూడా కథానాయికల(Heroine) ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

రష్మిక మందన్న(Rashmika Mandanna)- శ్రీలీల(Sreeleela). ఇద్దరూ ఇద్దరే! ఇద్దరూ వరుస సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. స్టార్‌ హీరోలతో నటిస్తూ అగ్రపథంలో దూసుకుపోతున్నారు. శ్రీలీల కంటే రష్మిక కొంచెం సీనియర్‌. అయినా వీరిద్దరి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. దర్శక, నిర్మాతలు కూడా కథానాయికల(Heroine) ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నటీనటులు కొన్ని సినిమాలను ఏవో కొన్ని కారణాల వల్ల తప్పుకోవడం మనం చూసే ఉన్నాం. చేజార్చుకున్నందుకు తర్వాత పశ్చాత్తాప పడిన సందర్భాలను కూడా చూశాం. లేటెస్ట్‌గా ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి స్టార్‌ హీరోయిన్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసిట్టు కూడా సమాచారం. విచిత్రమేమిటంటే ఆ ఇద్దరు హీరోయిన్లు రష్మిక, శ్రీలీలనే! పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్‌ లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో యానిమల్‌(animal), పుష్ప -2(Pushpa-2), రెయిన్ బో(Rainbow) సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఏడాది భీష్మ(Bishma) కాంబినేషన్ నితిన్‌కు(Nithin) జోడిగా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. కాకపోతే ఈ సినిమా నుంచి రష్మిక(Rashmika) తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆమె స్థానంలో పెళ్లిసందడి ఫేమ్‌ శ్రీలీల(Sreeleela) అవకాశం దక్కించుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. భీష్మ డైరెక్టర్‌ వెంకీ కుడుముల(Venky Kudumula) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి రష్మిక వైదొలిగినట్టు తెలుస్తోంది అయితే ఆమె చేతిలో వరుసగా భారీ సినిమాలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట! శ్రీలీల కిస్మత్‌ బాగుందిప్పుడు. ఎందుకంటే మహేశ్‌బాబు(Mahesh Babu) నటించిన గుంటూరు కారం(Guntur Karam) సినిమాలో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలనే అవకాశం దక్కించుకున్నారు.

టాప్‌ హీరోయిన్లలో ఇప్పుడు రష్మిక తర్వాత స్థానం శ్రీలీలదే అంటే అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరంలోనే ఆదికేశవ(Adhikeshava), స్కంద(skanda), భగవంత్ కేసరి(Bagavanth Kesari), గుంటూరు కారం(Gunturu Karam), వీడీ12(VD 12), ఉస్తాద్ భగత్ సింగ్‌తో(Ustad Bagath singh) సహా దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తున్నారు శ్రీలీల. కాగా, గతంలో హీరో నితిన్‌, హీరోయిన్‌ రష్మికా మందన్న భీష్మ చిత్రంలో నటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఆ సినిమా విజయవంతమయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందని అనుకున్న అభిమానులకు ఇప్పుడు నిరాశే ఎదురయ్యింది.

Updated On 13 July 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story