☰
✕
పుష్ప ఫేమ్ శ్రీవల్లి (రష్మిక)కు గాయాలైనట్లు తెలిసింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా గాయాలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.
x
పుష్ప ఫేమ్ శ్రీవల్లి (రష్మిక)కు గాయాలైనట్లు తెలిసింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా గాయాలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. పుష్ప విజయవంతం తర్వాత ఆమె సల్మాన్ సరసన సికిందర్ సినిమాలో నటిస్తోంది. కొద్దిరోజుల్లో సినిమా షూటింగ్ పట్టాలెక్కనున్న నేపథ్యంలో ఆమెకు గాయాలు అయ్యాయి. జిమ్ చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు గాయపడింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటోంది. అయితే దీనివల్ల ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు ఆగిపోయాయి. త్వరలోనే మళ్లీ షూటింగులు మొదలు పెడుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. సికిందర్ సినిమా ఈ ఏడాది మార్చిలో రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రష్మిక గాయం వల్ల షూటింగ్ ఆలస్యమైనా.. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు లేవని ఆ మూవీ టీమ్ చెబుతోంది.
ehatv
Next Story