రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarkonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో తెగ స్టోరీలు వచ్చాయి. వస్తున్నాయి కూడా! అబ్బే తమ మధ్య అలాంటిదేమీ లేదంటారు ఈ ఇద్దరూ! వీరిద్దరికి క్రేజీ కాంబినేషన్.

Rashmika Mandanna
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarkonda), రష్మిక మందన్నా(Rashmika Mandanna) మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో తెగ స్టోరీలు వచ్చాయి. వస్తున్నాయి కూడా! అబ్బే తమ మధ్య అలాంటిదేమీ లేదంటారు ఈ ఇద్దరూ! వీరిద్దరికి క్రేజీ కాంబినేషన్. గీతగోవిందం(Geetha govindham) సినిమాలో ఈ జంటను చూసి మురిసిపోయారు ప్రేక్షకులు. ఆ తర్వాత విజయ్, రష్మికలు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. అది కూడా హిట్టయ్యింది. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. ప్రొఫెసనల్‌గానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. సోమవారం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda) నటించిన గం గం గణేశ(Gam gam ganesha) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రష్మిక కూడా వచ్చింది. ఈ వేడుకలో ఆనంద్ యాంకర్ రోల్ పోషించాడు. రష్మికను కొన్ని ప్రశ్నలు అడిగాడు. రష్మిక పక్కనే కూర్చుని ప్రశ్నలేశాడు ఆనంద్ . మీ ఫేవరేట్ కోస్టార్ ఎవరని రష్మికను అడిగాడు. వెంటనే ప్రేక్షకులంతా రౌడీ బాయ్ అంటూ అరుపులు, కేకలు వేశారు. ఈ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో రష్మికకు తెలియలేదు. కాసేపు ఆగి కోపంతో కూడిన నవ్వుతో ఆనంద్ మీరు నా కుటుంబం రా.. ఇలా నన్ను స్పాట్‌లో పెట్టేస్తే ఎలా అని అడిగింది. చివరకు విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. దాంతో హాల్ అంతా దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది
