రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarkonda)- నేషనల్ క్రష్‌రష్మిక మందన్నా(Rashmika Madanna) మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే అనుకుంటున్నారు చాలా మంది. అసలు ఈ జంటను ఫ్యాన్స్ ఎంతగానో లైక్ చేస్తారు. వీరిద్దరు ఆన్‌స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ ముచ్చటగా యుగళగీతాలు పాడుకుంటున్నారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది.

Rashmika Diwali At Vijay House
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarkonda)- నేషనల్ క్రష్‌రష్మిక మందన్నా(Rashmika Madanna) మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే అనుకుంటున్నారు చాలా మంది. అసలు ఈ జంటను ఫ్యాన్స్ ఎంతగానో లైక్ చేస్తారు. వీరిద్దరు ఆన్‌స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ ముచ్చటగా యుగళగీతాలు పాడుకుంటున్నారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనికి సబంధించి చాలా కథనాలు వచ్చాయి. ఇది రూమర్ కాదని, నిజమేనని చెప్పడానికి వారిద్దరు ఇచ్చే హింట్స్ చాలు. తరచుగా వీరిద్దరు కలిసి వేకేషన్‌కు(Vacation) వెళ్లడం, విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక వెళ్లడం, అక్కడ విడివిడిగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గమనించదగిన విషయమేమింటే ఇద్దరి ఫోటోల బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండటం. సో వారిద్దరు కలిసే ఉన్నారని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ చెబుతుంటారు. లేటెస్ట్‌గా ఇది మరోసారి రిపీటయ్యింది. దీపావళి పండుగ(Diwali Festival) సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారు. అలాగే బాణాసంచా(Crackers) కాలుస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు రష్మిక మందన్నా కూడా దివాలీ శుభాకాంక్షలు అంటూ చీరకట్టులో ముస్తాబైన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో రష్మిక ఓ సోఫాలో కూర్చుంది. వీళ్లిద్దరి ఫోటోల్లో వెనకాల ఉన్న గోడ డిజైన్ ఒకేలా ఉండటంతో ఫ్యాన్స్ సరదా కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ దొరికిపోయారు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, రష్మిక కాబోయే అత్తారింట్లో పండగ జరుపుకుందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
