నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika mandanna) బిజీ అయ్యారు. పుష్ప(Pushpa) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ సోయగం అగ్ర కథానాయికగా దూసుకుపోతున్నది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా రష్మిక వరుస సినిమాలలో నటిస్తున్నది. రష్మిక డేట్స్‌ కావాలంటే ఏడాది ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం రష్మిక ఆరు సినిమాలలో నటిస్తున్నది. ఈ సినిమాల షూటింగ్స్‌ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుంది.

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika mandanna) బిజీ అయ్యారు. పుష్ప(Pushpa) సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ సోయగం అగ్ర కథానాయికగా దూసుకుపోతున్నది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషలలో కూడా రష్మిక వరుస సినిమాలలో నటిస్తున్నది. రష్మిక డేట్స్‌ కావాలంటే ఏడాది ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం రష్మిక ఆరు సినిమాలలో నటిస్తున్నది. ఈ సినిమాల షూటింగ్స్‌ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుంది. అవన్నీ పూర్తవుతే తప్ప రష్మికకు కొత్త సినిమాలను ఒప్పుకోవడానికి కుదరదు. రష్మిక డేట్స్‌ కావాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప-2(Pushpa-2), రెయిన్‌బో(Rainbow), గర్ల్‌ఫ్రెండ్‌(Girlfriend), కుబేర(Kubera) చిత్రాల్లో నటిస్తున్నది. పుష్ప-2 చిత్రీకరణ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. మిగిలిన మూడు
సినిమాలు షూటింగ్స్‌ జరుపుకుంటున్నాయి. యానిమల్‌ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టవ్వడంతో బాలీవుడ్‌లో కూడా రష్మికకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్‌ఖాన్‌తో సికిందర్‌ అనే సినిమాలో నటించే అవకాశం ఆమెకు లభించింది. విక్కీకౌశల్‌తో ఛావా సినిమాలో నటిస్తున్నది. హిందీలో మరికొన్ని ఆఫర్లు ఆమెకు లభించినప్పటికీ డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో అంగీకరించలేదు.

Updated On 13 May 2024 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story