రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో ‘సామి సామి’ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మాయి తక్కువ టైమ్ లోనే తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైంది. అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘చలో’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి […]

రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో ‘సామి సామి’ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మాయి తక్కువ టైమ్ లోనే తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైంది. అయితే వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘చలో’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది రష్మిక. ఆ తర్వాత ‘ పుష్ప’ సినిమాతో ఈ అమ్మడు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. ఇక ‘సీతారామమ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది రష్మిక. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లోనూ పాగా వేయాలని చూస్తోంది ఈ స్మైలీ బ్యూటీ.

ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె చేసిన రెండు చిత్రలు కూడా విడుదలయ్యాయి. ఆ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా ఆమె పర్ఫామెన్స్ కు మంచి అప్లాడ్స్ ఒస్తున్నాయి. ఆమెతో సినిమాలు చేసేందుకు కూడా హిందీ దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే తాజాగా ముంబైలో Zee cine awards ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్న హాజరైంది. ఇక ఆమె వేసుకున్న డ్రస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎద భాగం నుంచి థైస్ వరకు మాత్రమే కనిపించే లా డ్రెస్ వేసుకుని ప్రత్యక్షమైంది. రష్మిక అలా కనిపించే సరికి ఫ్యాన్స్ అంతా ఈ...య్ అంటూ గోల చేశారు. రెడ్ కార్పెట్ మీద రష్మిక నడకకు, ఆమె డ్రస్సింగ్ స్టైల్ కు అందరూ మెస్మరైజ్ అయ్యారు.

ఆ ఈవెంట్ లో రష్మిక మందన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హగ్ ఇస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘చత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీతో ఆయన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Updated On 27 Feb 2023 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story