నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై(Rashmika Mandanna) మరో ఫేక్ వీడియోను(Fake Video) సృష్టించారు కొందరు దుండగులు. ఇటీవలే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను(Morphing video) సృష్టించి బాగా ఇబ్బంది పెట్టారు. ఆ ఘటనలో చాలా మంది రష్మికకు మద్దతుగా నిలిచారు. బాధ్యులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై(Rashmika Mandanna) మరో ఫేక్ వీడియోను(Fake Video) సృష్టించారు కొందరు దుండగులు. ఇటీవలే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను(Morphing video) సృష్టించి బాగా ఇబ్బంది పెట్టారు. ఆ ఘటనలో చాలా మంది రష్మికకు మద్దతుగా నిలిచారు. బాధ్యులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ ఇన్సిడెంట్‌ను మర్చిపోకముందే రష్మికకు సంబంధించిన మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్ చేశారు కొందరు. ఈ వీడియోలో రష్మిక జిమ్ సూట్(Gym Suit) ధరించి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. ఈ వీడియోపై రష్మిక సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ విశ్వసించవద్దని పోస్టులు పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను(Artificial Inteligence) చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. కృత్రిమ మేథస్సును ఉపయోగించి కొందరు దుండగులు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. జారా పటేల్ వీడియోకు రష్మిక మొఖాన్ని ఉపయోగించి చేసిన వీడియో ప్రకంపనలను సృష్టించింది. అమితాబ్ బచ్చన్ మొదలుకొని నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు బాసటగా కీర్తి సురేశ్, విజయ్‌దేవరకొండ నిలిచారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై రష్మిక కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందని అన్నారు రష్మిక మందన్నా .