లేదు లేదంటూనే ఉన్నది దాస్తున్నారు విజయ్‌దేవరకొండ(Vijay devarkonda), రష్మిక(Rashmika). మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌మి, అంతకు మించి ఏమీ లేదని సందర్భం వచ్చిన ప్రతీసారి చెప్పుకుంటారు. కానీ ఇద్దరి మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందన్నది ఫ్యాన్స్ అనుమానం. అందుకు వారిద్దరు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు కారణం. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటారు. కానీ వేరువేరు వీడియోలు, ఫోటోలు పెడతారు.
లేదు లేదంటూనే ఉన్నది దాస్తున్నారు విజయ్‌దేవరకొండ(Vijay devarkonda), రష్మిక(Rashmika). మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌మి, అంతకు మించి ఏమీ లేదని సందర్భం వచ్చిన ప్రతీసారి చెప్పుకుంటారు. కానీ ఇద్దరి మధ్యన సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందన్నది ఫ్యాన్స్ అనుమానం. అందుకు వారిద్దరు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు కారణం. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటారు. కానీ వేరువేరు వీడియోలు, ఫోటోలు పెడతారు. అలా ఇద్దరూ ఫ్యాన్స్‌కు దొరికేస్తుంటారు. చాన్నాళ్లుగా ఇది జరుగుతోంది. ఇప్పుడు మరోసారి జరిగింద. రష్మిక-విజయ్ దేవరకొండ ఇద్దరూ ప్రేమలో వున్నారనే రూమర్లకు ఆ ఇద్దరూ ఎప్పుడూ చెక్ పెట్టలేదు. ప్రేమించుకుంటున్నామన్న విషయం కూడా చెప్పడం లేదు. ఇద్దరూ ఎప్పుడో ఒకప్పుడు పెళ్లివార్త చెబుతారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్‌గా ఇద్దరూ ఒకే దగ్గర ఉండి వేరువేరు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దొరికిపోయారు. నెటిజన్లను వారు తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నారు. మొన్న రాత్రి ఫ్యామిలీ స్టార్(Family star) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ వేడుక పూర్తి అయిన తర్వాత తెల్లవారుజామున విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్పుకు వెళ్లారు. నిజానికి ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ల కోసం విజయ్ దేవరకొండ అమెరికాకు వెళ్లాలి. తాను అమెరికాకు వస్తున్నానని, థియేటర్లలో కలుద్దామని చెబుతూ ఓ వీడియోను ఏప్రిల్ 3వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. ఆసక్తికరమైన విషయమేమిటంటే అదే విధంగా రష్మిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ మంచి వీడియో పెట్టారు. ఈ రెండు వీడియోలలో ఉన్న కామన్ పాయింట్‌ను నెటిజన్లు పట్టుకున్నారు. రెండు వీడియోలలోనూ అందమైన నెమళ్లు కనిపించాయి. రెండింటిలోనూ పచ్చిక మైదానాలు కనపించాయి. రెండు వీడియోలు ఆల్‌మోస్టాల్ సేమ్ ఉన్నాయి. దాంతో ఇద్దరూ ఒకేచోట ఉన్నారన్న విషయం నెటిజన్లకు తెలిసిపోయింది. కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఆ శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ ఇద్దరిని అడుగుతున్నారు.