✕
#Nithiin New Movie Opening : భీష్మ కాంబో మళ్లీ రిపీట్.. ‘VNRTrio’ పేరుతో కొత్త సినిమా ప్రారంభం..!
By EhatvPublished on 24 March 2023 6:28 AM GMT
నితిన్ (Nithiin), రష్మిక మందన్న (Rashmika mandanna), వెంకి కుడుముల (Venky Kudumula), కాంబినేషన్లో వచ్చిన సినిమా భీష్మ. అయితే ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందంటూ మొన్న ఉగాది రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు టీమ్. ఆ వీడియోలో హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ నలుగురు కలిసి ‘VNRTrio’ మళ్లీ వచ్చేస్తుందంటూ.. మరిన్ని అప్డేట్స్ త్వరలో ఉంటాయని అనౌన్స్మెంట్ ఇచ్చారు.

x
VNR Trio
-
- నితిన్ (Nithiin), రష్మిక మందన్న (Rashmika mandanna), వెంకి కుడుముల (Venky Kudumula), కాంబినేషన్లో వచ్చిన సినిమా భీష్మ. అయితే ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందంటూ మొన్న ఉగాది రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు టీమ్. ఆ వీడియోలో హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ నలుగురు కలిసి ‘VNRTrio’ మళ్లీ వచ్చేస్తుందంటూ.. మరిన్ని అప్డేట్స్ త్వరలో ఉంటాయని అనౌన్స్మెంట్ ఇచ్చారు.
-
- హీరో నితిన్ (Nithiin), వెంకీకుడుముల (Venky Kudumula), రష్మిక మందన్నా (Rashmika mandanna) కలయికలో ‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ వస్తోంది. అయితే ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. కాగా ముహూర్తం సీన్‌కి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) క్లాప్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
- అయితే ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి డైరెక్టర్లు గోపీచంద్ మలినేని (Gopichand Malineni), కేఎస్ రవింద్ర (బాబీ) (K. S. Ravindra-Bobby) తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేయాలని డైరెక్టర్ వెంకీ కుడుముల చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. చిరుకి సెట్ అయ్యే స్క్రిప్ట్ రెడీ అవ్వకపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కాస్త సమయం తీసుకుంటుందనే చెప్పాలి.
-
- ఇదిలా ఉంటే వెంకీ కుడుముల (Venky Kudumula), చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో ఈ సినిమా రావడం కష్టమేనా ? అని ఫిల్మ్ లవర్స్ ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పుడు ‘VNRTrio’ పూజా కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) ప్రత్యక్షమవడంతో, ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ కుడుముల చిరంజీవితో ప్రాజెక్ట్ చేస్తారని ఇటు మెగా ఫ్యాన్స్ అండ్ అలాగే కామన్ ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.
-
- అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అంటే అది మైత్రీ మూవీ మేకర్స్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) వాళ్లకున్న సినిమా పిచ్చి, ప్యాషన్‌తో వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. ఎంతలా అంటే ఈ కంపెనీలో ఒకేసారి ఆరేడు ప్రాజెక్టులు లైన్ ఉంటుంటాయి. అవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే అని చెప్పుకోవచ్చు.
-
- అదలా ఉంటే గత జనవరిలో రెండు పెద్ద ప్రాజెక్టులను అనౌన్స్ చేసి రిలీజ్ చేశారు. అవి సాదాసీదా సినిమాలు కాదు.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమాలు అవి. మొదటగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.
-
- ఇక అదే కంపెనీ నుంచి రిలీజ్ అయిన మరో సినిమా ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). ఈ సినిమా కూడా జనవరిలోనే రిలీజయ్యి.. అంటే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతోపాటు పోటీగా థియేటర్లలో ఆడింది. ఈ చిత్రాన్ని ‘క్రాక్’ చిత్రంతో కమర్షియల్ అండ్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరొందిన గోపిచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం కూడా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలను గడించింది. అయితే ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అవ్వడంతో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)కు కమర్షియల్‌గా ఫుల్ కలెక్షన్లు ఒచ్చాయి.
-
- ఇక మైత్రీ మూవీ మేకర్స్ కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట అనే చెప్పాలి. వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న ఈ సంస్థ ఇటు కొత్త, పాత అని తేడా లేకుండా అందరు డైరెక్టర్లతో వసరు చిత్రాలను ప్రారంభించి.. వాటిని రిలీజ్ చేసి కమర్షియల్ హిట్లు కొట్టి వసూళ్లు రాబట్టుకుంటున్నారు. మరోవైపు ఒకట్రెండు సినిమాలు ఆడకపోయినా కూడా ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్లు కొడుతూ ఇండస్ట్రీలో కమర్షియల్ బ్యానర్‌గా, హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) ఒక వెలుగు వెలుగుతోంది.
-
- ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. చిన్న సినిమాలతో అత్యధిక లాభాలు గడించే బ్యానర్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం చిన్న సినిమాల వైపు చూసిన ఊసే లేకుండా పోతోంది. ఇటు కొత్త డైరెక్టర్లు సైతం ఆ సంస్థ నుంచి చిన్న సినిమాల నిర్మాణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్ద.. పెద్ద.. స్టార్లతోనే సినిమాలు చేయడకుండా ఇటు చిన్న సినిమాలపైనా కూడా కాస్త ఫోకస్ చేసి ‘బలగం’ చిత్రం తరహాలో లాభాలు గడించొచ్చు అంటున్నారు సినీ ప్రియులు.
-
- ఇక టాలీవుడ్లో నెంబర్ ప్రొడక్షన్ కంపెనీగా పేరున్న ఈ మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) వాళ్ల నుంచి నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందా అని ఫిల్మ్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాల నిర్మాణంపై ఈ సంస్థ హెడ్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

Ehatv
Next Story