రాశి ఖన్నా ఈ ముద్దుగుమ్మ..  అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది. 2014లో మనం సినిమాలో ఈ భామ గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇక ‘తొలి ప్రేమ’, ‘జై లవకుశ’, ‘జిల్’ వంటి సినిమాలతో ఈ అందాల రాశి ఫిల్మ్ లవర్స్ మనసులు దోచేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు షారుక్ ఖాన్ ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లింది. అదేంటి షారుక్ […]

రాశి ఖన్నా ఈ ముద్దుగుమ్మ.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది. 2014లో మనం సినిమాలో ఈ భామ గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇక ‘తొలి ప్రేమ’, ‘జై లవకుశ’, ‘జిల్’ వంటి సినిమాలతో ఈ అందాల రాశి ఫిల్మ్ లవర్స్ మనసులు దోచేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు షారుక్ ఖాన్ ను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లింది.

అదేంటి షారుక్ ఖాన్ ను బీట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ? అవును అదే నిజం. షారుక్ ఖాన్ ని బీట్ చేసి నెంబర్ వన్ ఇండియన్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. మనం నమ్మలేకపోయినా.. ఒకరకంగా రాశి ఖన్నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. అసలు విషయంలో ఏంటంటే.. IMDB (Internet Movie Database) వెబ్ సైట్ కొత్తగా ఒక వీక్లీ లిస్టు ప్రచురిస్తోంది.

పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ అనే జాబితాలో టాలీవుడ్ నటి రాశిఖన్నా మొదటి స్థానం సంపాదించింది. ఇక నెక్ట్స్ ప్లేస్ లలో షారుక్ ఖాన్, ఆదిత్య చోప్రా, విజయ్ సేతుపతి, రెజీనా కసాండ్రా వంటి వారు స్థానాలు దక్కించుకున్నారు. బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న షారుక్, దీపిక పదుకొనేలను రెండు, ఆరో స్థానాలకు నెట్టి రాశి ఫస్ట్ ప్లేస్ కి చేరింది.

ఇక IMDB చెబుతున్న వివరాల ప్రకారం ఈ లిస్ట్ అనేది ప్రేక్షకులు వేసే ఓట్లు అలాగే ఇండియాలో తమ వెబ్ సైట్లో ఎక్కువ మంది ఎవరిని సెర్చ్ చేస్తారు అనేదానిపై ఆధారపడి ఉంటుందని చెబుతోంది. మరోవైపు ఆ లిస్టు అనేక అంశాలను బేస్ చేసుకుని ప్రచురిస్తామని.. ఎక్కువ మంది చూసేందుకు ప్రయత్నిస్తున్నారని IMDB తెలిపింది.

అయితే ఈమెకు ఈ ప్లేస్ రావడానికి కారణం ఇటీవల రిలీజైన వెబ్ సిరీస్ ‘ఫర్జి’ వల్లనే అంటున్నారు నెటిజన్లు. విజయ్ సేతుపతి సహా బాలీవుడ్ కాస్ట్ చాలామంది నటించిన ఈ సిరీస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా RBI ఉద్యోగిగా నటించింది.

Updated On 24 Feb 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story