తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. హీరోగా కాకపోయినా.. తెలుగు హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినా చాలు రైయ్ అంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించగా.. తాజాగా రణ్ వీర్ సింగ్(Ranveer) కూడా టాలీవుడ్(Tollywood) లో ఓ భారీ బడ్జెట్ మూవీలో సందడి చేయబోతున్నారు.

తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. హీరోగా కాకపోయినా.. తెలుగు హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినా చాలు రైయ్ అంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించగా.. తాజాగా రణ్ వీర్ సింగ్(Ranveer singh) కూడా టాలీవుడ్(Tollywood) లో ఓ భారీ బడ్జెట్ మూవీలో సందడి చేయబోతున్నారు.

టాలీవుడ్ తో పాటు.. ఓవర్ ఆల్ ఇండియా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2(Pushpa-2) కూడా ఉంది. పుష్ప సినిమాతో ఒక ఊపు ఊపి వదిలిపెట్టాడు బన్నీ. పుష్ప మ్యానియా.. దేశ వ్యాప్తంగా ఎలా ప్రభావం చూపిందన్న విషయం..తెలిసిందే. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ అగ్ర హీరోలు సైతం తెలుగు చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇప్పటికే సల్మాన్‌ఖాన్‌(Salman Khan), సంజయ్‌దత్‌(Sanjay Dutt) వంటి బాలీవుడ్‌ టాప్‌స్టార్స్‌ తెలుగు సినిమాల్లో... నటించారు.. నటిస్తున్నారు. వారి వెంటే మరికొంత మంది స్టరా్స్ కూడా వరుసలో ఉన్నారు. అందులో స్టార్స్ కూడా ఉన్నారు. ఈ వరుసలో బాలీవుడ్‌ క్రేజీ హీరో రణ్‌వీర్‌సింగ్‌ చేరబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌(Allu Arjun) పుష్ప-2(Pushpa-2) సినిమాలో రణ్‌వీర్‌సింగ్‌ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది సుకుమార్ ప్లాన్ లో బాగంగా.. పుష్ప2కు బాలీవుడ్ లో మరింత పబ్లిసిటీ వచ్చే విధంగా రణ్ వీర్ సింగ్ కోసం ఓ అతిథి పాత్రను రావారట సుకుమార్ .

పుష్ప సినిమా యాక్షన్ బేస్ తో తెరకెక్కుతోంది. పుష్ప సీక్వెల్ లో యాక్షన్ సీన్స్ కోసం రణ్ వీర్(Ranveer) ను తీసుకున్నారట. యాక్షన్‌ సీక్వెన్స్‌లో రణ్‌వీర్‌సింగ్‌ పోలీస్‌ పాత్రలో కనిపిస్తారని, ఆయన ఎపిసోడ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. పుష్పరాజ్‌ పాత్రను పరిచయం చేసే పోలీస్‌ ఆఫీసర్‌గా రణ్‌వీర్‌సింగ్‌ క్యారెక్టర్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Updated On 3 July 2023 4:56 AM GMT
Ehatv

Ehatv

Next Story