రణవీర్- జానీ సిన్స్ మధ్య ఊహించని క్రాస్ఓవర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఎప్పటికప్పుడు తన స్టైలింగ్ తో ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఒక ఉత్పత్తికి సంబంధించిన వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్య పరిచాడు. అందులో ఒక ప్రముఖ పోర్న్ స్టార్ ఉండడంతో ఎక్కడలేని అటెన్షన్ చూపిస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్.. అడల్ట్ స్టార్ జానీ సిన్స్‌తో లైంగిక వెల్నెస్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక ప్రకటనలో కనిపించాడు. ఈ ప్రకటన మెలోడ్రామాటిక్ టీవీ సీరియల్‌లలో సీన్ లాగా అనిపిస్తుంది.

రణవీర్- జానీ సిన్స్ మధ్య ఊహించని క్రాస్ఓవర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఇద్దరు తారలు స్క్రీన్‌ను పంచుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఊహించని వినోదాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ప్రకటన ఎంతగానో వైరల్ అవుతూ ఉంది, ఇంటర్నెట్‌లో దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. చాలా మంది వ్యక్తులు దీన్ని చూడాలని అనుకోలేదని, మరికొందరు దీనిని 'అతిపెద్ద క్రాస్ఓవర్' అని పిలుస్తూ ఉన్నారు. రణవీర్ సింగ్, జానీ సిన్స్ చేసిన యాడ్.. పురుషుల లైంగిక ఆరోగ్యం చుట్టూ ఉన్న విషయాల గురించి చర్చించడం విశేషం.

Updated On 12 Feb 2024 10:11 PM GMT
Yagnik

Yagnik

Next Story