కొన్ని సినిమాలు హడావిడి చేయనవసరం లేదు. కథా బలంతో ఆడియన్స్ ను రప్పించుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాడ. ఈమూవీ థియేటర్లలో సందడి చేసి.. ప్రస్తుతం ఓటీటీలో కూడా అదరగొడుతుంది.
కొన్ని సినిమాలు హడావిడి చేయనవసరం లేదు. కథా బలంతో ఆడియన్స్ ను రప్పించుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాడ. ఈమూవీ థియేటర్లలో సందడి చేసి.. ప్రస్తుతం ఓటీటీలో కూడా అదరగొడుతుంది.
రంగమార్తాండ(Rangamarthanda) సినిమా చూసిన తరువాత చాలా కాలానికి ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ ప్రతీ ఓక్క ప్రేక్షకుడి మనసులోకి వస్తుంది. అంత అద్భుతంగా సినిమాను తీర్చి దిద్దాడు దర్శకుడు కృష్ణ వంశీ(KrishnaVamsi). ప్రతీ ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూసే సినిమా ఇది. బావోద్వేగాలను.. కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా.. కట్టడికాక కన్నీరు పెట్టేలా చేశాడు దర్శకుడు. కుటుంబ నేపథ్యం, నాటకరంగ, తెలుగు భాష, ఇలా ఈసినిమా ద్వారా ఎన్నో విషయాలను నేటి సమాజానికి.. నేటి తరం పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాడు.
ఇక ఈసినిమా థియేటర్ లో కి ఎంత సైలెంట్ గా వచ్చి..సైలెంట్ గా హిట్లు కొట్టిందో.. అంతే సైలెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా ఏక్కేసింది. ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అయ్యింది రంగమార్తాండ(Rangamarthanda)సినిమా. కృష్ణవంశీ (Krishna Vamsi) దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. రీసెంట్ గా ఉగాది కానుకగా మార్చ్ 22న రంగమార్తాండ(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎక్కువగా ప్రమోషన్స్ చేయకుండానే చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈమూవీ.. మంచి టాక్ తెచ్చుకుంది. ఓ వర్గం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది. మరాఠీలో మంచి విజయం సాధించిన నటసామ్రాట్(Nata Smarat) సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశారు.
ప్రకాష్ రాజ్(Prakash Raj) మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణ(Ramyakrishna), బ్రహ్మానందం(Brahmanandam), రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), శివాత్మిక(Shivathmika), అనసూయ(Anasuya), ఆదర్శ్(Adarsh)లీడ్ రోల్స్ చేసిన సినిమా రంగమార్తాడ. థియేటర్లలోకి ఎలా సైలెంట్ గా వచ్చిందో.. ఓటీటీలోకి కూడా అలానే వచ్చింది మూవీ. రంగమార్తాండ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ అమెజాన్ ప్రైమ్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్స్ లో సైలెంట్ గా సక్సెస్ అయిన రంగమార్తాండ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులని కూడా మెప్పించి సైలెంట్ హిట్ కొడుతుందా చూడాలి.