రణ్‌దీప్ హుడా బాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. తన నటనతో పాటు, తన పాత్ర పర్ఫెక్ట్‌గా రావడానికి ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అమీర్ ఖాన్ మాదిరిగానే పర్ఫెక్షనిస్ట్. రణదీప్ తాజా చిత్రం 'స్వతంత్ర వీర్ సావర్కర్' టీజర్ నిన్న విడుదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ విడుదల చేసింది
రణ్‌దీప్ హుడా(Randeep Hooda) బాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. తన నటనతో పాటు, తన పాత్ర పర్ఫెక్ట్‌గా రావడానికి ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అమీర్ ఖాన్(Amir Khan) మాదిరిగానే పర్ఫెక్షనిస్ట్. రణదీప్ తాజా చిత్రం 'స్వతంత్ర వీర్ సావర్కర్'(Swatantrya Veer Savarkar) టీజర్ నిన్న విడుదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్(Vinayak Damodar Savarkar) 140వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ టీజర్(Teaser) విడుదల చేసింది. రణ్‌దీప్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఈ సినిమాలో సావర్కర్ పాత్రలో నటించడానికి రణ్‌దీప్ చాలా బరువు తగ్గాడు. సినిమా నిర్మాత ఆనంద్ పండిట్(Anandh Pandit) ఆ వివరాలు పంచుకున్నారు.
వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రలో నటించడానికి రణదీప్ హుడా 18 కిలోలు తగ్గినట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ నిర్మాత(Producer) ఆనంద్ పండిట్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రణదీప్ వీర్ సావర్కర్ పాత్రను పోషించడానికి మొత్తం 26 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. ఆనంద్ పండిట్ మాట్లాడుతూ.. "ఆయన తన పాత్రలో నేటికీ లీనమై ఉన్నారు. ఈ పాత్రను తెరపై తీయడానికి.. తన పాత్రలో పర్ఫెక్ట్‌గా కనిపించడానికి ఎంతకైనా సిద్ధమని ముందుగానే చెప్పాడు. షూటింగ్ ప్రారంభం నుంచి ఆయన రోజంతా 1 ఖర్జూరం, 1 గ్లాసు పాలు మాత్రమే తాగేవాడు. నాలుగు నెలలు షూటింగ్ పూర్తయ్యే వరకు ఇది అతని దినచర్య". అని చెప్పారు. ఈ చిత్రానికి నటుడు, మరాఠీ చిత్ర దర్శకుడు మహేష్ మంజ్రేకర్(Mahesh Manjrekar) దర్శకత్వం వహించాల్సి ఉందని.. అయితే తేదీ సమస్యల కారణంగా అది కుదరలేదని నిర్మాత వెల్లడించారు.