ఈమధ్యసెలబ్రిటీలు(Celebrity) వస్తువుల కోసం లక్షల్లో.. కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్స్ అయితే రెండు నుంచి ఐదుకోట్ల వాచ్ లు.. ఆరేడు కోట్ల కార్లు.. లక్షల్లో ఖర్చు పెట్టి షర్ట్స్.. ఇలా ఖరీదైన లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ లో కూడా స్టార్స్ ఇలానే కాస్ట్లీ ఐటమ్స్స్ తో షాక్ ఇస్తున్నారు. ఇటు నెటిజన్లకు కూడా ఇదే పని.. స్టార్స్ వెరైటీగా ఏం చేస్తున్నారు.. వస్తువులకు ఎన్ని కోట్లు పెడుతున్నారు..అనేది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ పెట్టిన వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో.. ప్రభాస్(Prabhas), మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు నెట్టింట బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్(Ranbir Kaoor) ఫ్యానషన్ ఎంపికల గురించి వైరలవుతుంది. నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్(animal). డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్(Promotions) జోరుగా సాగుతున్నాయి. రణబీర్, రష్మిక(Rashmika Mandanna), డైరెక్టర్ సందీప్ వంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో రణబీర్ కపూర్ తో పాటు.. రష్మిక, డైరెక్టర్ సందీప్ వంగాకూడా బిజీ బిజీగా పాల్గొంటున్నారు. అంతే కాదు ఈ ఈవెంట్స్ లో రణ్ బీర్ కపూర్.. డిఫరెంట్ ఫ్యాషన్స్ ను ఫాలో అవుతూ.. కలర్ ఫుల్ గా కనిపిస్తూ.. సందడి చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా
యానిమల్ ఈవెంట్లో పాల్గొన్న రణబీర్ తన స్టైలీష్ లుక్‏లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన పెట్టుకున్న వాచ్(Watch) నెటిజన్ల కంట్లో పడింది. పాటేక్ ఫిలిప్ బ్రాండ్ కు చెందిన ఆక్వానాట్ సెల్ఫ్ వైండింగ్ వాచ్‌ 72 నుంచి 80 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.

అయితే ఈ విషయాన్ని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇండియన్ హారాలజీ ప్రకారం చెప్పాలంటే.. రణబీర్.. పటెక్ ఫిలిప్ 5168G-ఆక్వానాట్ వాచ్‌ని కలిగి ఉన్నారు. ఇది స్వీయ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్ వాచ్ బ్లూ ఎంబోస్డ్ డయల్, ట్రాపికల్ కాంపోజిట్ స్ట్రాప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈవాచ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక రణ్ బీర్ కపూర్ యానిమల్ తో బిజీగా ఉన్నాడు. చివరిగా అతను బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించారు.ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ కూడా నటించారు.

Updated On 20 Nov 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story