గత నెలలో షూటింగ్ ప్రారంభమైన ‘రామాయణం’ సినిమాకు ఎన్నో అడ్డంకులు

గత నెలలో షూటింగ్ ప్రారంభమైన ‘రామాయణం’ సినిమాకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ను కాపీరైట్ ఉల్లంఘన కేసు కారణంగా నిలిపివేశారు. సమస్య మూలం కాపీరైట్‌ హక్కులేనని తెలుస్తోంది. నమిత్ మల్హోత్రా.. మధు మంతెన నుండి ఈ సినిమా హక్కులను పొందారు. ఆయన ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించిన తరువాత సరైన పరిహారం అందలేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

మిడ్-డే నివేదిక ప్రకారం, కొత్త స్టూడియో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని మంతెన ఆరోపించారు. వారు తనకు డబ్బులు చెల్లించకుండా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకుని వెళ్లారని చెప్పారు. వారం రోజుల తర్వాత రామాయణం షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చట్టపరమైన ప్రమేయం కారణంగా చిత్రీకరణ షెడ్యూల్‌లో విరామం ఏర్పడింది. ఈ ఆలస్యం కారణంగా ఇతర ప్రాజెక్ట్‌లకు కట్టుబడి ఉన్న ప్రధాన నటీనటులకు షెడ్యూల్ సమస్యలను సృష్టిస్తోంది. రణబీర్ కపూర్ సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ & వార్' కోసం పని చేయాల్సి ఉంది. నివేదికల ప్రకారం, ఈ చిత్రం బడ్జెట్ రూ. 835 కోట్లు. ఇది ఇప్పటివరకు నిర్మించిన భారతీయ చలనచిత్రాలలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది.

Updated On 21 May 2024 2:48 AM GMT
Yagnik

Yagnik

Next Story