రణ్‏బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన యానిమల్ (Animal) సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకంటే ముందు ఈ సినిమా ప్రీ టీజర్ వచ్చేస్తోంది. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు (జూన్ 11న) ఈ ప్రీ టీజర్‏ను చిత్ర బృందం విడుదల చేయనుంది. రణ్ బీర్‏ను కొత్త అవతారంలో చూపిస్తుండటంతో ఇప్పుడిది బిగ్గెస్ట్ టాపిక్‏గామారింది. ఈ సినిమా వయోలెంట్(violent)‏గా ఉంటుందని అంటున్నారు.

రణ్‏బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన యానిమల్ (Animal) సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకంటే ముందు ఈ సినిమా ప్రీ టీజర్ వచ్చేస్తోంది. జూన్ 11న ఈ ప్రీ టీజర్‏ను చిత్ర బృందం విడుదల చేయనుంది. రణ్ బీర్‏ను కొత్త అవతారంలో చూపిస్తుండటంతో ఇప్పుడిది బిగ్గెస్ట్ టాపిక్‏గామారింది. ఈ సినిమా వయోలెంట్(violent)‏గా ఉంటుందని అంటున్నారు.

ఈ యానిమల్ చిత్రం కోసం ఫిల్మ్ లవర్స్ చాలా ఎగ్జైటింగ్‏తో ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‏లో పాగా వేశాడు. కొంత విమర్శలు ఎదుర్కొన్నా కూడా బాక్సాఫీసు దగ్గర రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం యానిమల్. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చెప్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ, కృష్ణన్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. రణ్‏బీర్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Updated On 11 Jun 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story