తాను ఇప్పటికీ మంచి భర్తను కాలేదన్నారు బాలీవుడ్ యంగ్ స్టార్.. రణ్ బీర్ కపూర్. తన కూతురు పుట్టిన తరువాతే తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. భర్తగా తను ఇంకా నేర్చుకోవల్సింది చాలా ఉంది అన్నారు.
తాను ఇప్పటికీ మంచి భర్తను కాలేదన్నారు బాలీవుడ్ యంగ్ స్టార్.. రణ్ బీర్ కపూర్. తన కూతురు పుట్టిన తరువాతే తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. భర్తగా తను ఇంకా నేర్చుకోవల్సింది చాలా ఉంది అన్నారు.
బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ప్రస్తుతం ఆలియా భట్(Alia Bhatt), రణ్ బీర్ కపూర్(Ranbir Kapoor) పేరే వినిపిస్తుంది. దాదాపు ఐదేళ్ళు ప్రేమించుకుని లాస్ట్ ఇయర్ హాడివిడిగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. వెంటనే హడావిడిగా ఓబిడ్డకు తల్లీ తండ్రులుగా కూడా మారారు. మంచి తల్లీ తండ్రులు అనిపించుకోవడం కోసం.. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చి మరీ పాపను చూసుకుంటున్నారు ఈ బాలీవుడ్ జంట. ఆమె పేరు రాహా కపూర్. రీసెంట్ గా ఫస్ట్ మ్యారేజ్ ఆనివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ జంట. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాంకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి.
ఇక తాజాగా రణ్ బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మంచి భర్తను కాలేకపోయానన్నారు. ఇంకా భర్తగా తనను తాను మెరుగుపరుచుకుంటున్నాను అన్నారు రణ్ బీర్. కూతురు రాహా కపూర్ గురించి, భార్య ఆలియా భట్ గురించి, వారి మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తూ .. తాను మాత్రం మంచి భర్తను కాలేకపోతున్నా అన్నారు రణ్ బీర్. అంతే కాదు గతంలో ఓ సారి ఇలానే ఆలియా భగ్ గురించి ప్రశ్న వేయగా.. ఆమె కు మంచి భార్యగా.. మంచి తల్లిగా ఎన్ని మార్కులు ఇస్తారని అడగ్గా.. ఆలియా రెండింటిలె బెస్ట్...ముఖ్యంగా తల్లిగా ఆమెకు ఎక్కువగా మార్కులు పడతాయి అన్నారు.
తనకి కూతురు పుట్టిన తర్వాత ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని, ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలోని టెక్నిక్స్ తెలుసుకున్నానని చెప్పాడు. కూతురు పుట్టాక తను చాలా మారానని, ఆమె తప్ప తనకు వేరే ప్రపంచమే లేదని చెప్పాడు రణబీర్ కపూర్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ..ప్రస్తుతం తన జీవితంలో తండ్రి, భర్త, కొడుకు, హీరో.. ఇలా అన్ని పాత్రలు ఉన్నాయి, వాటిలో తను బెటర్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే మంచి భర్తనని మాత్రం తను భావించడం లేదని తెలిపాడు రణ్‌బీర్. రణ్ బీర్ వాఖ్యలకు నెటిజన్లు ఆశ్చర్చపోతున్నారు.
ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది ఈ జంట. ఆలియా భట్ రెండేళ్లు సినిమాలకు విరామం ఇచ్చి కూతురి ఆలన పాలన చూసుకోవాలని ప్లన్ చేసింది. అటు రణ్ బీర్ కూడా తన పాపతో సమయం గడపడానికి ఆరు నెలలు షూటింగ్స్ కు విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది.