పుష్ప(Pushpa) సినిమా అల్లు అర్జున్‌కు(Allu Arjun) నేషనల్ అవార్డు తెచ్చిపెడితే రష్మికకేమో(Rashmika) నేషనల్ క్రష్‌గా(National Crush) పేరు తెచ్చింది. మంగళూరుకు చెందిన రష్మిక మందన్నా కిరిక్‌పార్టీ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చలో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. గీతగోవిందం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటించే స్థాయికి ఎదిగింది.
పుష్ప(Pushpa) సినిమా అల్లు అర్జున్‌కు(Allu Arjun) నేషనల్ అవార్డు తెచ్చిపెడితే రష్మికకేమో(Rashmika) నేషనల్ క్రష్‌గా(National Crush) పేరు తెచ్చింది. మంగళూరుకు చెందిన రష్మిక మందన్నా కిరిక్‌పార్టీ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చలో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. గీతగోవిందం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. కాకపోతే బాలీవుడ్‌లోనే(Bollywood) రష్మిక పరిస్థితి అంత బాగోలేదు. హిందీలో నటించిన మొదటి సినిమా గుడ్‌బై(Good Bye) ఆశించినంతగా విజయం సాధించలేదు. తర్వాత వచ్చిన మిషన్ మజ్ను(Mission Majnu) కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన యానిమల్(animal) సినిమాలో నటిస్తున్నది రష్మిక. ఈ సినిమాపైనే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబిడియోల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపైనే రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె బాలీవుడ్ కెరీర్ ఈ చిత్రం రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందనేది వాస్తవం. ఇదిలా ఉంటే తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్ లేదు. అందుకు కారణం రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ డిజాస్టర్ కావడమే! ఇకపోతే వారియర్స్ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలు వచ్చాయి. దీంతో హిందీ చిత్రం యానిమల్ హిట్ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప–2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప–2 తో పాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో రష్మిక నటిస్తోంది.