మొన్నీమధ్యనే రామాయణం(Ramayanam) ఆధారంగా భారీ బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్(Adhipurush) సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. రాముడిగా ప్రభాస్(Prabhas), సీతగా కృతి సనన్(Kriti sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటించిన ఈ సినిమాకు ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించారు. ఆరంభం నుంచే ఈ సినిమా అనేక వివాదాలను చవి చూసింది. అనేక విమర్శలను ఎదుర్కొంది..

Ramayanam Movie
మొన్నీమధ్యనే రామాయణం(Ramayanam) ఆధారంగా భారీ బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్(Adhipurush) సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. రాముడిగా ప్రభాస్(Prabhas), సీతగా కృతి సనన్(Kriti sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటించిన ఈ సినిమాకు ఓం రౌత్(Om Raut) దర్శకత్వం వహించారు. ఆరంభం నుంచే ఈ సినిమా అనేక వివాదాలను చవి చూసింది. అనేక విమర్శలను ఎదుర్కొంది.. ఇది అలా ఉంచితే, రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అల్లు అరవింద్(Allu Arvindh), మధు మంతెన(Madhu Manthena), సమిత్ మల్హోత్రాలు(sumith Malhothra) కలిసి రామాయణ గాధను తెరకెక్కించబోతున్నారన్న వార్త వచ్చి దాదాపు మూడేళ్లు దాటింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించిన అప్‌డేట్ రాలేదు. ఈ సినిమా ఆగిపోయినట్టుగా ఉందని కొందరు అనుమానించారు కూడా! అయితే ఆ సందేహాలకు తెరదించారు మేకర్స్.
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చాలా సందర్భాలలో నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి(Nithish Thiwari) ఈ సినిమా పనులను వేగవంతం చేశారని బాలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై ఆయన దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, ఆంజనేయుడు వంటి ప్రధాన పాత్రలకు నటీనటులను ఎంపిక చేసి , స్క్రీన్ టెస్ట్‌లను నిర్వహించే పనిలో నితీష్ తివారి ఉన్నారట. రాముడిగా రణ్‌భీర్ కపూర్(Ranbir Kapoor) సీతగా ఆలియాభట్(alia Bhatt), రావణుడిగా యశ్(Yash) నటించనున్నారని, వీరికి లుక్ టెస్ట్ జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రామాయణంలో రియల్‌లైఫ్ జంట రణ్‌భీర్, ఆలియాలు సీతారాములుగా నటిస్తారా? కేజీఎఫ్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టిన యశ్ రావణుడిగా అద్భుతాలు చేస్తారా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
