రానా దగ్గుబాటి(Rana Daggubati).. అసలు పరిచయం చేయనవసంర లేది పేరు. రామానాయుడు(Ramanaidu)వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా.. హోస్ట్ గా.. మరీముఖ్యంగా ప్రొడ్యూసర్ గా.. ఎన్నోపాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు రానా. కెరీర్​లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు హ్యాండ్సమ్ హంక్. ఇక తను మనసారా ప్రేమించిన మిహికా బజాజ్ ను 2020 పెళ్లి చేసుకున్నారు రానా దగ్గుబాటి.

రానా దగ్గుబాటి(Rana Daggubati).. అసలు పరిచయం చేయనవసంర లేది పేరు. రామానాయుడు(Ramanaidu)వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా.. హోస్ట్ గా.. మరీముఖ్యంగా ప్రొడ్యూసర్ గా.. ఎన్నోపాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు రానా. కెరీర్​లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు హ్యాండ్సమ్ హంక్. ఇక తను మనసారా ప్రేమించిన మిహికా బజాజ్ ను 2020 పెళ్లి చేసుకున్నారు రానా దగ్గుబాటి. ఇక రానాను మించిన మంచితనంతో కలుపుగోలుతనంతో మిహికా తన కుటుంబం పేరు నిలబెడుతుంది.

సోషల్ మీడియా(Social Media)లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది మిహీక.. తన భర్తతో ఉన్న ఫొటోలను.. ఫ్యామిలీ అకేషన్స్ తో పాటు తన పర్సనల్ విషయాలు కూడా కొన్ని షేర్ చేస్తుంటుంది. అంతే కాదు కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి సమాజ సేవ చేస్తూ.. ఆ విషయాలు కూడా నెట్టింట్లో పంచుకుంటుంది. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్​కు నెటిజన్స్​ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిహీక గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు.

ఇంతకీ అంతలా మిహికా బజాజ్ ఏం పోస్ట్ పోట్టిందంటే..? పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మిహీక బజజ్ చేసిన ఓ పని అందరిచేత శభాష్ అనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో సంస్థతో కలసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మిహీక.. ఈ క్రమంలో మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్​ను పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని మిహీక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆమె చేసిన పని తెలిసి మిహికను కొనియాడుతున్నారు నెటిజన్లు.

ఇండియాలో కరెంట్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వారికి కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి వీలుగా లేకపోవడంతో చీకట్లో మగ్గుతున్నారు మారు మూల ప్రజలు. అంతేకాదు ఆయా గ్రామాల్లో మహిళలు రాత్రి వేళల్లో తమ పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఆ ఎన్జీవోతో కలసి మిహీక లైట్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో నెటిజన్స్​ వీరిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Updated On 6 April 2023 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story