దగ్గుబాటి రానా(Rana Daggubati) కథానాయకుడిగా హిరణ్య కశ్యప(Hiranya Kasyapa) అనే సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అమెరికాలోని శాండియగోలో(San Diego) జరుగుతున్న కామిక్ కాన్-2023(Comic can-2023) వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభాస్‌కు తోడుగా రానా కూడా వెళ్లారు. ప్రాజెక్ట్ కే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్, రానా సందడి చేయనున్నారు.
దగ్గుబాటి రానా(Rana Daggubati) కథానాయకుడిగా హిరణ్య కశ్యప(Hiranya Kasyapa) అనే సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అమెరికాలోని శాండియగోలో(San Diego) జరుగుతున్న కామిక్ కాన్-2023(Comic can-2023) వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభాస్‌కు తోడుగా రానా కూడా వెళ్లారు. ప్రాజెక్ట్ కే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్, రానా సందడి చేయనున్నారు. ఆ వేడుకలలో భాగంగానే రానా తన కొత్త చిత్రాలను, ఇతర ప్రాజెక్టులను ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో హిరణ్యకశ్యప సినిమాను చేయాలన్న కోరిక రానాకు ఎప్పట్నుంచో ఉంది. అందుకోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు కూడా.
తాజాగా ఆ సినిమాను కామిక్ కాన్ వేదికపై ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా(spirit Media) పతాకంపై ఈ చిత్రం తెరకెక్కబోతున్నదని రానా తెలిపారు. అమర చిత్ర కథల ఆధారంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్(trivikram) రచనలో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే లార్డ్ ఆఫ్ ది డెక్కన్(Alage Lord Of The Deccan) పేరుతో సోనీ లివ్‌తో కలిసి నిర్మించనున్న సిరీస్‌ని కూడా ఈ వేదికపై ప్రకటించారు. చాళుక్యుల రాజవంశం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. వీకెండ్ బ్లాక్‌బస్టర్ సంస్థతో కలిసి మిన్నల్ మురళి హాస్యపాత్రతో కూడిన మరో ప్రాజెక్ట్‌ని కూడా ఈ వేదికపైనే ఆవిష్కరించి అంతర్జాతీయ స్థాయిలో వాటికి ప్రాచుర్యం లభించేలా చేశారు.అయితే గతంలో రానాతో హిరణ్య కశ్యప తెరకెక్కిస్తానని దర్శకుడు గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రానా తాజా ప్రకటనలో ఎక్కడా గుణశేఖర్ ప్రస్తావన లేదు. మరి ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తారా? లేదా? శాకుంతలం రిజల్ట్ తర్వాత రానా మనసు మార్చుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.