సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) నటించిన సూపర్‌డూపర్‌ సినిమాలలో పడయప్ప(Padayappa) కూడా ఒకటి. ఈ సినిమాను తెలుగులో నరసింహ(Narsimha) పేరుతో డబ్‌ చేశారు. ఇక్కడ కూడా విజయవంతమయ్యింది. ఇందులో సౌందర్య(Soundharya), రమ్యకృష్ణ హీరోయిన్‌లుగా నటించారు. ఇందులో పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా, ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. 1999లో విడుదలైన ఈ సినిమాకు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నడిగర తిలకం శివాజీ గణేశన్‌, లక్ష్మి, సితార, నాజర్‌, రాధా రవి, సత్యప్రియ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధానపాత్రలలో నటించారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) నటించిన సూపర్‌డూపర్‌ సినిమాలలో పడయప్ప(Padayappa) కూడా ఒకటి. ఈ సినిమాను తెలుగులో నరసింహ(Narsimha) పేరుతో డబ్‌ చేశారు. ఇక్కడ కూడా విజయవంతమయ్యింది. ఇందులో సౌందర్య(Soundharya), రమ్యకృష్ణ హీరోయిన్‌లుగా నటించారు. ఇందులో పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా, ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. 1999లో విడుదలైన ఈ సినిమాకు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నడిగర తిలకం శివాజీ గణేశన్‌, లక్ష్మి, సితార, నాజర్‌, రాధా రవి, సత్యప్రియ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధానపాత్రలలో నటించారు. ఎ.ఆర్‌.రహమాన్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టయ్యాయి. ఇందులో ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో సౌందర్యను రజనీకాంత్‌ ప్రేమిస్తారు. కానీ రజనీకాంత్‌ను రమ్యకృష్ణ ప్రేమిస్తారు. అయితే పెద్దల అంగీకారంతో సౌందర్యను పెళ్లి చేసుకోవడానికి రజనీకాంత్‌ అంగీకరిస్తారు. ఈ కారణంగా సౌందర్య, రమ్యకృష్ణ మధ్య వైరం మొదలవుతుంది.

అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఈ దృశ్యంలో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచడమే కాకుండా ఆమెను ఉద్దేశించి కామెంట్స్‌ చేస్తారు. ఈ సీన్‌లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని లేటెస్ట్‌గా రమ్యకృష్ణ తెలిపారు. ' నరసింహ సినిమాలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయాను. ఆ షాట్ నాకు ఇష్టం లేదు. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. దర్శకుడి ఆదేశాల మేరకు తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నాను. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టాను . ఆ సీన్‌లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్‌లో ఉన్నాను.' అని రమ్యకృష్ణ అన్నారు. అయితే ఆ సినిమా షూటింగ్‌లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ చెప్పడంతో ఆ వదంతులకు తెరపడింది. సౌందర్య, రమ్యకృష్ణ మధ్య మంచి స్నేహం ఉండేదని పరిశ్రమలో టాక్‌. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారట! ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే లాస్టియర్‌ రంగ మార్తాండ సినిమాలో కనిపించారు. ఇటీవల రిలీజైన రజినీకాంత్ జైలర్ చిత్రంలోనూ కీలకపాత్రలో నటించారు. మరోవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Updated On 19 Aug 2023 7:52 AM GMT
Ehatv

Ehatv

Next Story