రాంచరణ్ ఉపయోగిస్తున్న లగ్జరీ వాహనాల విషయానికి వస్తే కస్టమైజ్డ్ మెర్సిడిస్ మైబ్యాక్GLS 600 ,ఆడి మార్టిన్ v 8 వాన్టాజ్ , రోల్స్ రాయల్స్ ఫాంటమ్ ,రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ,ఆస్టన్ మార్టిన్ ,ఫెరారీ పోర్టోఫినో ,తోపాటు ఒక ప్రైవైట్ జెట్ కూడా రాంచరణ్ కు వినియోగిస్తారు .
ఆస్కార్ వేడుకల్లో తెలుగు సినిమా కీర్తి వెలిగిపోయింది. RRR టీం నిన్న జరిగిన ఆస్కార్ వేడుకల్లో సందడి చేసారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు పాట ఆస్కార్ ని దక్కించుకొని దేశ ఖ్యాతిని పెంచింది. తెలుగోడిని గర్వపడే సందర్భాన్ని ఇచ్చింది. రాజమౌళి రూపొందించిన RRR కి సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం ,చంద్రబోస్ అందించిన అచ్చ తెలుగు లిరిక్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగేలా చేసింది ఆస్కార్ వేడుక . ఈ వేడుక లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాంచరణ్ ,jr N.t.R .. రెడ్ కార్పెట్ ఎక్స్పీరియన్స్ చేసిన భావోద్వేగ క్షణాలని అక్కడి మీడియా తో పంచుకున్నారు . మెగా రాంచరణ్ గత కొన్ని రోజులగా ఇంటర్నేషనల్ మీడియాకు వరుస ఇంటర్వ్యూ లు ఇవ్వటం జరుగుతున్నా నేపథ్యంలో ఇప్పుడు రాంచరణ్ పైన ఇంటర్నేషనల్ మీడియా దృష్టి పడింది .ఈ క్రమంలో రామచరణ్ వివరాలు ,అతని ఆస్తుల వివరాలు ,అతని ఆదాయం గురించి తెలుసుకోవాలని చాల మంది ఆసక్తి చూపిస్తున్నారు .
కొణిదెల రాంచరణ్ ఆస్తుల విలువ దాదాపుగా 1350 కోట్లు ఉంటుందని అంచనా . రాంచరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరో,ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు . తన తండ్రి సినిమా ఖైదీ నం . 150 తో రామచరణ్ నిర్మాతగా మారారు . ఈయన నెల సంపాదన దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది. రాజమౌళి మగధీర రాంచరణ్ కెరియర్ లో బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా కాగా ,RRRసినిమా తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు . RRR సినిమా కోసం 45 కోట్ల పారితోషకం రాంచరణ్ తీసుకున్నారని సమాచారం.
రాంచరణ్ ఉపయోగిస్తున్న లగ్జరీ వాహనాల విషయానికి వస్తే కస్టమైజ్డ్ మెర్సిడిస్ మైబ్యాక్GLS 600 ,ఆడి మార్టిన్ v 8 వాన్టాజ్ , రోల్స్ రాయల్స్ ఫాంటమ్ ,రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ,ఆస్టన్ మార్టిన్ ,ఫెరారీ పోర్టోఫినో ,తోపాటు ఒక ప్రైవైట్ జెట్ కూడా రాంచరణ్ కు వినియోగిస్తారు .
పెప్సీ,ఫ్రూటీ,వోలోనో,టాటాడొకోమో,హీరో మెటో క్రాప్ ,అపోలో జియో వంటి వాటికీ బ్రాండ్ అంబాసిడర్ గ వ్యవహరించారు రాంచరణ్ . ముంబై లో ఒక పెంట్ హౌస్ ని ఖరీదు చేసారు .హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 40 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫెసిలిటీస్ కలిగిన సొంత విశాలమైన భవంతి కలిగివున్నారు . మన దేశంలో అత్యధికంగా టాక్స్ పే చేసే వ్యక్తుల జాబితాల్లో రామ్ చరణ్ ఒకరు .