ఆదిపురుష్‌(adipurush) సినిమా వచ్చిన తర్వాత దేశంలో రామాయణం(Ramayanam) గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకు ముందు సెల్యూలాయిడ్‌పై వచ్చిన రామాయణ ఆధారిత సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఆదిపురుష్‌ సినిమాను దర్శకుడు ఓం రౌత్‌(Om raut) చెత్తగా తీశారని జనం తిట్టిపోస్తున్నారు.

ఆదిపురుష్‌(adipurush) సినిమా వచ్చిన తర్వాత దేశంలో రామాయణం(Ramayanam) గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకు ముందు సెల్యూలాయిడ్‌పై వచ్చిన రామాయణ ఆధారిత సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఆదిపురుష్‌ సినిమాను దర్శకుడు ఓం రౌత్‌(Om raut) చెత్తగా తీశారని జనం తిట్టిపోస్తున్నారు. రామాయణ ఇతిహాసం గురించి నీకు ఏం తెలుసని? డబ్బు కోసం ఏది పడితే అది తీస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రామకథ తెలియకపోతే రామానంద్‌ సాగర్‌(Ramanandhan Sagar) రామాయణం సీరియల్‌ చూసి బుద్ధి తెచ్చుకో అంటూ మండిపడుతున్నారు. రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి సమయంలో రామాయణ్‌ సీరియల్‌ను మరోసారి టెలికాస్ట్‌ చేయాలని, రామాయణం గొప్పదనాన్ని అందరికీ తెలియచేయాలని చాలా మంది రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రామానంద్‌సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్‌ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ప్రముఖ టీవీ ఛానెల్‌ షెమారూ కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణం సీరియల్‌ను(Ramayanam Serial) రీటెలికాస్ట్‌ చేయనున్నట్లు ఆ ఛానెల్‌ ప్రకటించింది. జూలై 3వ తేదీ నుంచి రామాయణం సీరియల్‌ను రీ టెలికాస్ట్‌ చేస్తున్నామని షెమారూ టీవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ కూడా రిలీజ్‌ చేసింది. ప్రతిరోజూ రాత్రి ఏడున్నరకు ఈ సీరియల్‌ను ప్రసారం చేస్తున్నారు. 1987 జనవరి 25 నుంచి 1988 జూలై 31వ తేదీ వరకు ప్రతిరోజు ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఇది టెలికాస్ట్‌ అయ్యింది. ఆ సమయంలో వీధులన్నీ నిర్మానుష్యమయ్యేవి.

అన్ని మతాల ప్రజలు ఈ సీరియల్‌ను చూశారు. అందుకే ఈ సీరియల్‌ చాలా సక్సెస్‌ అయ్యింది. అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న సీరియల్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకుంది. ఈ సీరియల్‌ను కరోనా సమయంలో రీటెలికాస్ట్‌ చేశారు. 2020 మార్చి 28వ తేదీ నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం టెలికాస్ట్‌ చేశారు. అప్పుడు కూడా ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పుడు ఆదిపురుష్‌ వివాదం తర్వాత రెండోసారి రీటెలికాస్ట్‌కు సిద్ధమైంది.

Updated On 29 Jun 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story