రామాయణం(Ramayanam) ఆధారంగా తీసిన ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)ను ప్రేక్షకులు తిప్పికొట్టారు. దర్శకుడు ఓంరౌత్(Om Raut)ను తిట్టిపోశారు. నాసిరకమైన డైలాగులు, పాత్రల వేషధారణలపై విమర్శలు వెల్లువెత్తాయి. రామాయణ గాధను హృద్యంగా చిత్రీకరిస్తే చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలియక ఓం రౌత్ పెద్ద తప్పిదం చేశాడు.
రామాయణం(Ramayanam) ఆధారంగా తీసిన ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)ను ప్రేక్షకులు తిప్పికొట్టారు. దర్శకుడు ఓంరౌత్(Om Raut)ను తిట్టిపోశారు. నాసిరకమైన డైలాగులు, పాత్రల వేషధారణలపై విమర్శలు వెల్లువెత్తాయి. రామాయణ గాధను హృద్యంగా చిత్రీకరిస్తే చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలియక ఓం రౌత్ పెద్ద తప్పిదం చేశాడు. ఇదిలా ఉంటే, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Arvind) మరికొందరు బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి రామాయణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటించే తారాగణంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం నటీనటులకు లుక్ టెస్ట్ చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)ను ఎంపిక చేశారట. అలాగే సీతగా అలియాభట్(Alia Bhatt)ను తీసుకోబోతున్నారట! వీరి ఎంపికపై రామాయణం నటుడు సునీల్ లహ్రీ(Sunil Lahri) రీసెంట్‌గా ఓ కామెంట్ చేశాడు. 'రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌లిద్దరూ మంచి నటులు. కచ్చితంగా కథకు న్యాయం చేస్తారు. రాముడిగా రణ్‌బీర్ సరైన ఎంపిక. ఆ పాత్రకు అతడు కచ్చితంగా సరిపోతాడు. అలియా కూడా టాలెంటెడ్ యాక్టరెస్. కానీ గతంలో ఇలాంటి పాత్రలు చేసి ఉంటే సీత పాత్రకు మరింత న్యాయం చేయగలదు. గత కొన్నేళ్లలో అలియా నటనలో చాలా మార్పులు వచ్చాయి. మరి సీతగా ఎలా నటిస్తుందో చూడాలి' అని సునీల్ లహ్రీ అన్నాడు. ఈ సినిమాలో రావణుడి పాత్రకు యశ్‌ను ఎంపిక చేశారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ, వాటిపై యశ్ క్లారిటీ ఇచ్చాడు. తాను బాలీవుడ్ సినిమాలలో నటించడం లేదని స్పష్టం చేశాడు.