✕
Dimple Hayathi In Red Dress : రెడ్ డ్రెస్సులో ఫొటోలు పోస్ట్ చేసిన రామబాణం భామ.. ఆ క్యప్షన్ అందుకేనా.. ?!
By EhatvPublished on 25 May 2023 12:31 AM GMT
డింపుల్ హయాతి (Dimple Hayathi) ఈ భామ హరీష్‌శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర’ సాంగ్‌తో ఆడియన్స్‌లో బాగా గుర్తుండిపోయింది.

x
Dimple Hayathi
-
- డింపుల్ హయాతి (Dimple Hayathi) ఈ భామ హరీష్‌శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర’ సాంగ్‌తో ఆడియన్స్‌లో బాగా గుర్తుండిపోయింది. ఈ ముద్దుగుమ్మ 2017లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంలో లక్ష్మీ క్యారెక్టర్‌తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇక 2019లో ‘యురేక’, ‘దేవీ2’, ‘అభినేత్రి 2’ చిత్రాల్లోనూ డింపుల్ నటించింది.
-
- డింపుల్ హయాతి (Dimple Hayathi) గ్లామర్ ఒలకబోయడంలో నెంబర్ వన్ అనే చెప్పాలి. డస్కీ బ్యూటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో బీచ్‌లో బికినీలో అందాలను ఆరబోసి.. యూత్‌లో సెగలు పుట్టించింది డింపుల్.
-
- 2021లో వచ్చిన ఆత్రంగిరే చిత్రంలోనూ మెరిసింది. డింపుల్ అడపాదడపా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా అమ్మడుకి సరైన బ్రేక్ రావడం లేదు. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది ఈ భామ.
-
- ఇటు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్సులో తన ఒంపుసొంపు సోయగాలను చూపించింది. అయితే ఈ ఫొటోలకు ఉమెన్ పవర్ గురించి మీనింగ్ వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. అయితే మొన్నామధ్య ఈ బ్యూటీపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఫ్యాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు.
-
- కాగా ఇప్పుడు ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ బాక్సులో ఆమెకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా వరకు యూజర్లు ‘వి సపోర్ట్ యూ’ అంటూ ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించి కామెంట్ బాక్సులో వదులుతున్నారు.
-
- చిన్నవయస్సు నుంచే సినిమాలు, టీవీలు చూసి... అందులో వచ్చే నటీనటుల యాక్టింగ్‌ను ప్రాక్టీస్ చేసేదట డింపుల్. దాంతోపాటు సాంగ్స్‌కు డాన్స్ కూడా చేస్తుండేదట ఈ అమ్మడు. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడంతోపాటు ఎన్నో స్టేజీ షోలు కూడా చేసిందట ఈ బ్యూటీ.
-
- ఈ అమ్మడు ఫిట్ నెస్ గురించి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా చేస్తూనే ఇన్‌స్టా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది ఈ తెలుగు పిల్ల. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ గుండెల్లో సెగలు పుట్టిస్తుంటోంది ఈ డింపుల్. ప్రస్తుతం డింపుల్ హయాతి (Dimple Hayathi)కి ఇన్‌స్టా గ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story