✕
Rama Banam Movie : అనుబంధాల విలువ చెప్పే ప్రయత్నం చేసిన రామబాణం
By EhatvPublished on 5 May 2023 6:56 AM GMT
ఎన్నిసార్లు మీడియాతో మాట్లాడినా, రామబాణం యూనిట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎప్పటికీ పాతబడవనీ, రక్తసంబంధాలు విడిపోవచ్చుగానీ, ఎప్పటికీ తెగిపోవనీ, రామబాణం కథలో ఉన్న సెంటిమెంట్ ఎలిమెంట్‌ని ఎలివేట్ చేస్తూనే మాట్లాడుతూ వచ్చారు. గోపీచంద్ అయితే ఇటువంటి కథ గురించే వెయిట్ చేసి మరీ ఎంపిక చేసుకున్నట్టు మీడియా ద్వారా

x
Rama Banam Movie
-
- ఎన్నిసార్లు మీడియాతో మాట్లాడినా, రామబాణం యూనిట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎప్పటికీ పాతబడవనీ, రక్తసంబంధాలు విడిపోవచ్చుగానీ, ఎప్పటికీ తెగిపోవనీ, రామబాణం కథలో ఉన్న సెంటిమెంట్ ఎలిమెంట్‌ని ఎలివేట్ చేస్తూనే మాట్లాడుతూ వచ్చారు. గోపీచంద్ అయితే ఇటువంటి కథ గురించే వెయిట్ చేసి మరీ ఎంపిక చేసుకున్నట్టు మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కి, సగటు ప్రేక్షకులకీ స్సష్టం చేయడంతో రామబాణం సినిమాకి విడుదలకి ముందు మంచి ఇమేజే వచ్చింది.
-
- పైగా బాలకృష్ణ రామబాణం టైటిల్‌ని సూచించడంతో మరింత మాస్‌కి దగ్గరగా వెళ్ళింది రామబాణం. పెరఫెక్టు...భూపతిరాజా చెప్పిన కథలో ఏ పాయంట్ అయితే నచ్చిందో దర్శకుడు శ్రీవాసుకి, హీరో గోపీచంద్‌కీ-ఆ పాయంట్ని బాగా ఖర్చుపెట్టి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడంలో తమ ప్రొఫెషనల్ టచ్‌ని ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయగలిగారు. బడ్జెట్ కూడా అనుకున్నదాని కన్నా కూడా ఎక్కువే అయిందన్న మాట కూడా గట్టిగానే వినిపించింది.
-
- శ్రీవాసు ముందే చెప్పినట్టుగా రామబాణం కరెక్టు కమర్షియల్ మీటర్లోనే ఒదిగిపోయి, రెండుగంటల 15నిమిషాల పాటూ సాగింది. పాట, ఫైట్, సెంటిమెంట్, రివెంజ్...అంటే రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల పోకడలో ఏమాత్రం తేడా లేకుండా రామబాణం చిత్రాన్ని చిత్రీకరించాడు శ్రీవాసు. ఆ రకం సెంటిమెంట్ చిత్రాలను లైక్ చేసేవారికి తప్పనిసరిగా రామబాణం నచ్చుతుంది. ఇది ఏజ్ ఓల్డ్ కథ అని ఎందరు కూనిరాగాలు తీసినా సరే, ఇటువంటి సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరిస్తారు. గోపీచంద్, శ్రీవాసు కాంబినేషన్లో వచ్చే హేట్రిక్ సినిమాగా రామబాణం ఎంత ప్రాచుర్యం పొందడంతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి.
-
- ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ హీరోకైనా ఎప్పుడూ రిస్కే. చిన్నప్పుడే తమ్ముడు ఇంట్లో నుంచి పారిపోయి, కలకత్తాలో డాన్‌గా ఎదిగిపోవడంతో రామబాణం సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత ఎదిగి, ప్రేమలోపడి, హీరోయిన్ ఫాదర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ప్రశ్నించినప్పుడు మళ్ళీ హీరో ఇంటికి తిరిగి వచ్చి, అక్కడ రాముడి లాంటి అన్నయ్య గురించి రహస్యంగా ఛాలెంజ్‌లు తీసుకోవడం, ఆయనని మట్టుబెడదామనుకున్నవాళ్ళ భరతం పట్టడం ఇలా...ఓ ఫ్రేమ్లైన్లో రామబాణం కథ సాగుతుంది.
-
- గోపీచంద్, జగపతిబాబు, ఖుష్బూ..తదితదరులు ఎవరి మట్టుకు వారు వాళ్ళ పాత్రలలో రాణించారు. దర్శకుడు శ్రీవాసు తను నమ్మిన కథావస్తువును తన బాణీలో ప్రజెంట్ చేశాడు. క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్‌లో ఎక్కడా వేలెత్తి చూపించలేం. మేకింగ్ వేల్యూస్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రేంజ్ సిగ్నేచర్ స్పష్టంగా కనబడుతుంది. Written By నాగేంద్రకుమార్

Ehatv
Next Story