డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar). అయితే ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితం పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబో మళ్లీ రిపీట్ అవబోతుందని ఎన్నో రూమర్స్ ఒచ్చాయి.

iSmart Shankar Seque
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar). అయితే ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితం పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబో మళ్లీ రిపీట్ అవబోతుందని ఎన్నో రూమర్స్ ఒచ్చాయి. నాలుగేళ్ల క్రితం ఇస్మార్ట్ శంకర్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్‌ను అందించిన ఈ జోడీ జనాలకు బాగా కనెక్ట్ అయింది. గట్టిగా చెప్పాలంటే నైజామ్‌లో దుమ్ములేసేసిందనేదే ఫైనల్ మాట. ఇక ఈ సినిమా రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ఇక తాజాగా రామ్ పోతినేని అభిమానులకు ఓ అద్భుతమైన న్యూస్ చెప్పేశారు పూరీ కనెక్ట్స్ బ్యానర్ టీమ్. పూరీ జగన్నాథ్, చార్మీకౌర్ (Charmy Kaur) జంటగా రూపొందనున్న సినిమా కోసం ఈ బ్లాక్ బస్టర్ జంట మరోసారి కలవనుంది. ఇస్మార్ట్ శంకర్ 2 ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు రేపు సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక లాస్ట్ టైమ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ (Liger) చిత్రం బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ 2 ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు.. ఈ న్యూడ్ న్యూస్ వినడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.
