ఈమధ్య కొత్త సినిమాలన్నీ త్వరగా ఓటీటీ(OTT) బాట పడుతున్నాయి. వాటి లిస్ట్ లోనే చేరింది స్కంద(Skanda) మూవీ. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati srinu).. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కాంబినేషన్ లో.. ఊరమస్ సినిమాగా రిలీజ్ అయ్యింది స్కంద. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా..యావరేజ్ గా నిలిచింది.

ఇలా థియేటర్ లో రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడే డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కబోతోంది స్కంద మూవీ. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఏ ఓటీటీలో..?

ఈమధ్య కొత్త సినిమాలన్నీ త్వరగా ఓటీటీ(OTT) బాట పడుతున్నాయి. వాటి లిస్ట్ లోనే చేరింది స్కంద(Skanda) మూవీ. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati srinu).. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కాంబినేషన్ లో.. ఊరమస్ సినిమాగా రిలీజ్ అయ్యింది స్కంద. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా..యావరేజ్ గా నిలిచింది.

శ్రీలీల(Sreeleela), సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్(Srikanth), గౌతమి(Gauthami), ఇంద్రజ(Indhraja) లాంటి సీనియర్ నటుడు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను అంతగా ప్రభావితం చేయలేక పోయింది. ఈక్రమంలో ఈసినిమా త్వరలో డీజిటల్ ప్లాట్ ఫామ్(Digital platform) ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఏ సినిమా అయినా... రిలీజ్ అయిన 50 రోజుల తరువాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కాని ఈమధ్య సినిమాలు అలా రిలీజ్ అయ్యి.. ఇలా ఓటీటీ బాట పడుతున్నాయి. స్కంద ముందుగా రిలీజ్ అయిన 50 రోజుల తరువాత స్ట్రీమింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నారట. కాని ఎందుకో ఏమో అనుకున్న టైమ్ కుముందుగానే ఈసినిమా డిజిటల్ రిలీజ్ అవుతోంది. అయితే ఈసినిమా హక్కులను భారీ రేటుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఇక స్కంద మూవీ అక్టోబర్ 27న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అంటే రిలీజ్ అయిన నెలరోజులు పూర్తి కాకముందు ఓటీటీ బాట పట్టబోతోంది స్కందా మూవీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. స్కంద చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో క‌నిపించింది. ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated On 24 Oct 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story