ది ఎటాకర్ అనేది ఉప శీర్షిక. సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా లెవల్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు అయిన స్కందను టైటిల్‌గా పెట్టామని చిత్రబృందం తెలిపింది. టైటిల్‌తో పాటు యాక్షన్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆలయం నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ వీడియో ఆకట్టుకుంటున్నది.

ram potineni skandha
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్కంద అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ది ఎటాకర్ అనేది ఉప శీర్షిక. సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా లెవల్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు అయిన స్కందను టైటిల్‌గా పెట్టామని చిత్రబృందం తెలిపింది. టైటిల్‌తో పాటు యాక్షన్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల (Sree leela) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆలయం నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ వీడియో ఆకట్టుకుంటున్నది. 'మీరు (సినిమాలో రౌడీలను ఉద్దేశించి) దిగితే ఊడేదుండదు. నేను దిగితే మిగిలేదుండదు' అంటూ రామ్ చెప్పే డైటాల్‌తో ఈ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ సినిమా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
