ఎనర్జిటిక్‌ యాక్టర్‌ రామ్‌ పోతినేని(Ram Pothineni), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా స్కంద. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RAPO20 ప్రాజెక్ట్‌గా మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది

ఎనర్జిటిక్‌ యాక్టర్‌ రామ్‌ పోతినేని(Ram Pothineni), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా స్కంద. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RAPO20 ప్రాజెక్ట్‌గా మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇటీవల నీ చుట్టూ చుట్టూ పాటను విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో ఈ పాట ఊపేస్తోంది. ఇప్పుడు మరో అప్‌డేట్ వచ్చింది.

ఫైనల్ పాట షూటింగ్‌తో స్కంద చిత్రీకరణ పూర్తయింది. పాట షూట్‌ లోకేషన్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో రామ్‌, హీరోయిన్‌ శ్రీలీల. ఈ పాట కూడా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందన్నది తాజా లుక్‌తో తెలుస్తోంది. స్కంద చిత్రాన్ని సెప్టెంబర్‌ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్‌(Srinivas Silver screen) పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను తీస్తున్న ఈ సినిమా ఇదే కావడంతో స్కందపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్కందతో పాటు పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో డబుల్‌ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు రామ్‌ పోతినేని. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన షూటింగ్ అప్‌డేట్ స్టిల్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Updated On 10 Aug 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story