ఎనర్జిటిక్‌ హీరో రామ్‌(Ram) అభిమానులే కాదు, టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా Rampo20. దీనికి మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింత పెంచాయి. లేటెస్ట్‌గా సినిమా బృందం ప్రేక్షకులకు ఓ చక్కటి వార్త చెప్పింది.

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌(Ram) అభిమానులే కాదు, టాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా Rampo20. దీనికి మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింత పెంచాయి. లేటెస్ట్‌గా సినిమా బృందం ప్రేక్షకులకు ఓ చక్కటి వార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల విషయంలో కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అనుకున్న సమయానికి కంటే ముందే ఈ సినిమా విడుదల కానుందని ఆ వార్తల సారాంశం. ఇప్పుడు అదే విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. సెప్టెంబర్‌ 15వ తేదీన సినిమాను విడుదల(movie Release) చేస్తున్నట్టు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రామ్‌ పోతినేని(ram pothineni) పంచెకట్టుతో కూల్‌ లుక్‌తో ఉన్న ఈ ఫోటో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోటో చూసి రామ్‌ ఫ్యాన్స్‌ మస్తు ఖుషీ అవుతున్నారు. సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ తమకు కావాలని, సినిమా పేరు ఏమిటో చెప్పాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

బోయపాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో ఈ సినిమా కూడా అలాగే పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల(sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌ సన్నివేశాలు హైలైట్‌ కానున్నాయట. ఇటీవల ఆ సన్నివేశాలపై రామ్‌ ట్వీట్‌(tweet) చేశారు. ఇది క్లయిమాక్స్‌(climax) కాదు, అంతకు మించి అని కామెంట్‌ చేశాడు. దాంతో క్లయిమాక్స్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సినీ ప్రియులలో మొదలయ్యింది. ఈ సినిమాతో రామ్‌ పాన్‌ ఇండియాలోకి అడుగుపెట్టనున్నాడు. థమన్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు మరో నాలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Updated On 24 Jun 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story