బోయపాటి శ్రీను(Boyapati Sreenu) సినిమాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన! ఇక మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్‌తో(RAM) ఆయన సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కు పండగే పండగ! జీ స్టూడియోస్(Zee Studios), పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్(Srinivas Silver screens) పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు.

Ram Boyapati Movie
బోయపాటి శ్రీను(Boyapati Sreenu) సినిమాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన! ఇక మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్‌తో(RAM) ఆయన సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కు పండగే పండగ! జీ స్టూడియోస్(Zee Studios), పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్(Srinivas Silver screens) పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ కాంబోలో ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ రామ్ ఫ్యాన్స్‌కు జోష్‌ను తెచ్చింది.
ఈ సినిమా ముందస్తు షెడ్యూల్ ప్రకారం దసరా పండుగ కానుకగా అంటే అక్టోబర్ 20న విడుదల చేయాలనుకుంది చిత్ర యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం మరో నెల ముందుగానే అంటే సెప్టెంబర్‌లో ప్రేక్షకులకు మందుకు రాబోతున్నది. సినిమా పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరడంతో అప్పటి వరకు ఎదురు చూడటం ఎందుకని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నది. ఇటీవలే రామ్ పుట్టినరోజుకు విడుదల చేసిన ఫస్ట్ థండర్(First Thunder) సినిమాపై ఆసక్తి పెంచింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
