వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి సెన్సార్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలను ఇచ్చింది.కోర్టు నిర్ణయంతో

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్‌ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. గతంలోనే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. లోకేష్‌ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపింది. అయితే వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి సెన్సార్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలను ఇచ్చింది.కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్‌ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్‌ బోర్డు తెలిపింది.

ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. వ్యూహం విడుదల కాబోతోందంటూ సోషల్ మీడియాలో వర్మ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

Updated On 8 Feb 2024 11:36 PM GMT
Yagnik

Yagnik

Next Story