దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఏం చేసినా సంచలనమే! ఏది మాట్లాడినా వివాదాస్పదమే! ఇటీవలి కాలంలో ఆయన తీసిన రాజకీయ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర చతికిలపడినప్పటికీ అవి సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి విడుదలయ్యే వరకు చర్చోపచర్చలు సాగుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను నిర్మించబోతున్నారు రామ్‌గోపాల్‌ వర్మ.

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ఏం చేసినా సంచలనమే! ఏది మాట్లాడినా వివాదాస్పదమే! ఇటీవలి కాలంలో ఆయన తీసిన రాజకీయ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర చతికిలపడినప్పటికీ అవి సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి విడుదలయ్యే వరకు చర్చోపచర్చలు సాగుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను నిర్మించబోతున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan Mohan Reddy) సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అసలు వ్యూహం సినిమా ఎలా ఉండబోతున్నది. ఏ అంశాలను స్పృశించబోతున్నారు? అన్న ఆసక్తి ప్రేక్షకులకతో పాటు రాజకీయ నాయకుల్లోనూ మొదలయ్యింది. వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం(Vyuham) ఎలా ఉండబోతున్నదో ఆయనే చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జీవితంలో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది వ్యూహం మొదటిభాగంలో చూపిస్తారు. అలాగే 2015 నుంచి 2023 వరకు జగన్మోహన్‌రెడ్డి జీవితంలోని జరిగిన ప్రధాన ఘట్టాలను వ్యూహం సెకండ్‌ పార్ట్‌లో చూపిస్తామని వర్మ చెప్పారు. వ్యూహం మొదటి భాగాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని, వ్యూహం రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తామని వర్మ తెలిపారు. వ్యక్తిగతంగా జగన్‌ వ్యక్తిత్వం తనకు బాగా ఇష్టమని వర్మ తెలిపారు. మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటారని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) చనిపోయిన తర్వాత జగన్‌ను తొక్కేయాలని కొందరు కుట్రలు చేశారని, వాటిని కూడా తాను సినిమాలో చూపిస్తానని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

Updated On 13 Jun 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story