మెహర్ రమేశ్(Mehar Ramesh) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్(Bhola Shankar) ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్‌హిట్ అయిన అజిత్ సినిమా వేదాళంకు ఇది రీమేక్! మొదటి ఆట నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మెగా ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చలేదు. చిరంజీవి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉందని కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ(RGV)కు వివాదాలంటే చాలా ఇష్టం. కాసింత సందు దొరకాలే కానీ ఇట్టే దూరిపోతారు. ఆయన సినిమాలు ఎంత వివాదాస్పదం అవుతాయో సోషల్ మీడియా(Social Media)లో ఆయన పెట్టే పోస్టులు కూడా అంతే వివాదం అవుతుంటాయి. ఏ అంశంపైనైనా కాసింత వ్యంగ్యంతో కూడిన పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
మెహర్ రమేశ్(Mehar Ramesh) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళాశంకర్(Bhola Shankar) ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్‌హిట్ అయిన అజిత్ సినిమా వేదాళంకు ఇది రీమేక్! మొదటి ఆట నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మెగా ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చలేదు. చిరంజీవి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉందని కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే భోళాశంకర్ ప్రీ రీలిజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో హైపర్ ఆది మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచేశాడు. రాజకీయాలు కూడా మాట్లాడాడు. మెగాఫ్యామిలీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. కొంత అప్రస్తుత ప్రసంగం కూడా చేశాడన్న విమర్శలు వచ్చాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మరోసారి భోళాశంకర్‌పై చర్చ మొదలయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొందరు అతిగా మాట్లాడారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి విషయాలపై చురుగ్గా స్పందించే రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్‌గా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. పొగడ్తలకు అలవాటు పడిపోయి రియాల్టీకి దూరమవుతున్నారని అనిపిస్తోందంటూ పరోక్షంగా చిరంజీవిని దెప్పిపొడిచారు. ‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు . దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. ‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అని రాసుకొచ్చారు రామ్‌గోపాల్ వర్మ.