ఎక్కడ వివాదం ఉంటే అక్కడ వర్మ ఉంటారు కదా!
హీరో రాజ్ తరుణ్(Raj Tharun) తనతో పదకొండేళ్లు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి, అబార్షన్(abortion) కూడా చేయించాడని లావణ్య చౌదరి(Lavanya chowdhary) ఆరోపించిన సంగతి తెలిసిందే! దీనిపై సోషల్ మీడియాలో రోజుకో కథ వస్తున్నది. విశ్లేషణలు కూడా వస్తున్నాయి. సరే ఇప్పటి వరకు ఎపిసోడ్‌ను చూస్తూ వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(ram gopal varma) రియాక్టయ్యారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ వర్మ ఉంటారు కదా! అలాగే ఇందులో కూడా వేలు పెట్టారన్నమాట! ఆయన సహజంగానే రాజ్‌తరుణ్ సైడ్ తీసుకున్నారు. 'నాకు రాజ్ మాత్రమే కావాలంటే అది చాక్లెట్ కాదు కదా. అతడికి ఇష్టంలేనప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్ స్టాండింగ్ కు రావాలి. పదకొండు ఏళ్లు సహజీవనం చేశానంటోంది. పెళ్లి చేసుకొని, 20 ఏళ్లు కాపురం చేసినోళ్లే విడాకులు తీసుకుంటున్నారు. సహజీవనంలో విడిపోవడం అసలు పాయింట్ కాదు' అని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. అలాగే లావణ్య చౌదరి వరుసగా ఆడియో క్లిప్స్(Audio clips) విడుదల చేయడంపై కూడా రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించాడు. క్రిమినల్ ఆలోచనలు ఉన్నవారే ఇలాంటి పనులు చేస్తారని వర్మ అన్నాడు. ఆడియో రికార్డ్ చేయడమనే ఆలోచనే క్రిమినల్ మైండ్ సెట్ నుంచి వస్తుందని, ఆ ఆడియో క్లిప్స్ ను లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుందని వర్మ చెప్పుకొచ్చాడు. 'రాజ్ తరుణ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరికి ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ ఆమెకు కొంత డబ్బిచ్చాడని ఆమె స్వయంగా చెబుతోంది. కోర్టు లోపల అవుతుందా, కోర్టు బయట అవుతుందా అనే సంగతి పక్కనపెడితే.. డబ్బుతోనే ఈ మేటర్ సెటిల్ అవుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఉండడమనేది మాత్రం అసంభవం' అని దర్శకుడు వర్మ తెలిపాడు. రాజ్‌తరుణ్-లావణ్య చౌదరి వ్యవహారం మీడియా సర్కస్‌గా మారిందని వర్మ అన్నాడు. సోషల్ మీడియాలో ఇదో వెబ్ సిరీస్‌గా మారిపోయిందని తెలిపాడు. అయితే మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ మరో వారం పది రోజుల పాటు వస్తుందని చెప్పిన వర్మ అందుకు రీజన్ కూడా ఇచ్చారు. రాజ్‌తరుణ్‌కు బెయిల్ వచ్చేసింది కాబట్టి, కొత్తగా ఇవ్వాల్సిన సాక్ష్యాలు కూడా ఏం లేవు కాబట్టి, చివరికి పనిమనుషుల ఇంటర్వ్యూలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి, మరో వారం రోజుల్లో ఈ వివాదం మీడియాకు ఓల్డ్ న్యూస్ కింద మారిపోతుందని విశ్లేషిస్తున్నాడు వర్మ.
My observations on the RELATIONSHIP HORRORS between MEN and WOMEN in the context of Raj Tarun and Lavanya ISSUE https://t.co/Y4FTfmnVSC
— Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2024