ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ (ram gopal Varma)ఆశలు ఫలించాయి. తాను ఎంతో ఇష్టపడి, పట్టదలతో తెరకెక్కించిన వ్యూహం (vyuham)సినిమాకు సెన్సార్ అడ్డంకులు (censor board)తొలిగిపోయాయి. తాజాగా ఈమూవీ రిలీజ్ పై ఆయన సోషల్ మీడియా (social media)వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ (ram gopal Varma)ఆశలు ఫలించాయి. తాను ఎంతో ఇష్టపడి, పట్టదలతో తెరకెక్కించిన వ్యూహం (vyuham)సినిమాకు సెన్సార్ అడ్డంకులు (censor board)తొలిగిపోయాయి. తాజాగా ఈమూవీ రిలీజ్ పై ఆయన సోషల్ మీడియా (social media)వేదికగా క్లారిటీ ఇచ్చారు.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ (AP politics) ను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు వ్యూహం, శపథం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(ys Jagan) లైఫ్ లోని కొన్ని విషయాలను తీసుకుని.. గతంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవితో (Chiranjeevi)పాటు పలువురు ప్రముఖులకు పాత్రలు ఉండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈసినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాదు ఎప్పుడెప్పుడా అని ఈమూవీస్ గురించి ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు మరింత ఇంట్రెస్ట్ ను పెంచేశాయి టీజర్, ట్రైలర్, పోస్టర్స్.

అయితే సరిగ్గా వ్యూహం సినిమా పూర్తి చేసి.. నవంబర్ 10న రిలీజ్ చేయబోతుండగా.. వారం రోజుల్లో మూవీ రిలీజ్ అనగా.. సెన్సార్ బోర్డ్ ఈమూవీకి అడ్డు కట్ట వేసింది. వ్యూహం సినిమాకు.. ఆర్జీవీకి సెన్సార్ బోర్డు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఈమూవీలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులను పోలి ఉన్నాయని, పేర్లు కూడా ఆ వ్యక్తులకు సంబంధించినవే పెట్టారని, ఇందుకు సెన్సార్ అంగీకారం ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో వర్మ కూడా ఘాటుగానే స్పందించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు. సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీకి ఎందుకు వెళ్ళమని చెప్పారో నాకు తెలియదు. దీని మీద టిడిపి వాళ్ళు ఏమన్నా పిర్యాదు చేసారా అనేది కూడా తెలియాల్సి ఉంది... అని విమర్షలు చేశారు.

ఇక ఆతరువాత సెన్సార్ బోర్డు చెప్పినట్లు రివైజ్ కమిటీకి వెళ్ళారు ఆర్జీవి. దాంతో నవంబర్ 10న రిలీజ్ కావల్సిన వ్యూహం వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావడంతో..హ్యూహం సినిమాకు రిలీజ్ అడ్డంకులుతొలగిపోయాయి. ఈ సందర్భంగా ఎంతో సంతోషంతో సోషల్ మీడియా వేదికగా ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. డిసెంబర్ 29న ఈమూవీ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించాడు. అంతే కాదు సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని ఫోటో దిగడంతో పాటు.. ఆ పిక్ ను నెట్టింట్లో శేర్ చేశారు వర్మ.

Updated On 13 Dec 2023 10:18 AM GMT
Ehatv

Ehatv

Next Story