రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదైనా విషయం గురించి స్పందించాలి అంటే ఆయన తరువాతే ఎవరైనా. పొలిటికల్ అయినా.. సినిమా అయినా ఏదైనా స్పందించాలి అంటే ఆయన తరువాతే. ముఖ్యంగా వర్మపై వచ్చే కామెంట్లకు ఆయన ఇచ్చే సమాధానం చాలా ఫన్నీగా ఉంటుంది. అవతలివారిపై సెటైర్లు వేస్తూ..వర్మ చేసే ఫీట్లు భలే ఫన్నీగా ఉంటాయి. ఆయన చమక్కుల కోసమే ఎక్కువ మంది ఆయన్ను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి తన టాలెంట్ చూపించారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ(ram Gopal Varma) స్పందించారు.. తనదైన స్టైల్ లో స్పందించారు.. అది కూడా తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. ఇంతకీ వర్మ ఏమన్నాడంటే..?

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదైనా విషయం గురించి స్పందించాలి అంటే ఆయన తరువాతే ఎవరైనా. పొలిటికల్ అయినా.. సినిమా అయినా ఏదైనా స్పందించాలి అంటే ఆయన తరువాతే. ముఖ్యంగా వర్మపై వచ్చే కామెంట్లకు ఆయన ఇచ్చే సమాధానం చాలా ఫన్నీగా ఉంటుంది. అవతలివారిపై సెటైర్లు వేస్తూ..వర్మ చేసే ఫీట్లు భలే ఫన్నీగా ఉంటాయి. ఆయన చమక్కుల కోసమే ఎక్కువ మంది ఆయన్ను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా మరోసారి తన టాలెంట్ చూపించారు వర్మ.

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. గ్లోబల్ స్టార్.. రాజమౌళి(Rajamouli) రామ్ గోపాల్ వర్మ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వాటి గురించి స్పందించారు వర్మ. ఇంతకీ జక్కన్న ఏమన్నారంటే..? సినిమా ఇలాగే తీయాలనే ఫార్ములాను పక్కన పెట్టి నేను సినిమాను ఇలాగే తీస్తాననే డైరెక్టర్లు కొందరు ఉంటారని... వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇలాంటి డైరెక్టర్లు ఆడియెన్స్ ను షేక్ చేస్తారని, ఇండస్ట్రీని(Film Industry) షేక్ చేస్తారని, సినిమాను ఇలాగే తీయాలనే ఫార్ములాను కూడా షేక్ చేస్తారని చెప్పారు.

అంతే కాదు ఇలాంటి డైరెక్టర్లో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కూడా ఒకరని ప్రశంసించారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన 'యానిమల్'(Animal) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజమౌళి తనను ప్రశంసించడం పట్ల వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ గురించి ఎప్పుడూ వినలేదని సరదాగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇక వర్మ శిష్యుడైన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో.. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా యానిమ్ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ వల్ల అవి భారీగా పెరిగిపోయాయి.

Updated On 29 Nov 2023 10:23 PM GMT
Ehatv

Ehatv

Next Story