✕
Ram Gopal Varma-Prabhas : డార్లింగ్ ప్రభాస్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ.. ఇది నిజమా అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 5 April 2023 2:22 AM GMT
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అంటే ఈ ప్రపంచంలో తెలియవాళ్లు ఎవరూ ఉండరనుకుంట. ఎందుకంటే ఆయన చాలా వరకు సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో జనాల నోళ్లలో నానుతుంటారు. వర్మ (Varma) ఏది చేసినా ఒక సెన్సేషనే మరి. ఏది మాట్లాడినా.. ఆయన డేర్ అండ్ డ్యాషింగ్‌గా మాట్లాడతారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు చేసిన ఆయన ఈ మధ్య ఏ సినిమా చేసినా అది అస్సాం పోతోంది.

x
RGV Prabhas
-
- రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అంటే ఈ ప్రపంచంలో తెలియవాళ్లు ఎవరూ ఉండరనుకుంట. ఎందుకంటే ఆయన చాలా వరకు సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో జనాల నోళ్లలో నానుతుంటారు. వర్మ (Varma) ఏది చేసినా ఒక సెన్సేషనే మరి. ఏది మాట్లాడినా.. ఆయన డేర్ అండ్ డ్యాషింగ్‌గా మాట్లాడతారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు చేసిన ఆయన ఈ మధ్య ఏ సినిమా చేసినా అది అస్సాం పోతోంది.
-
- రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాలు తగ్గించి.. ఎక్కువగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నారు. అదంతా పక్కన పెడితే మారుతి (Maruthi) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) హీరోగా ఓ సినిమా రాబోతుంది. అయితే ఇందుకు సంబంధించి ఓ కొత్త వార్త వినిపిస్తోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా డీలక్స్ (Raja Deluxe) సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ క్యారెక్టర్ చేస్తున్నాడట. అదికూడా ఓ క్యామియో రోల్ అట.
-
- అయితే దీనికి సంబంధించిన సీన్స్ అన్నీ ఇప్పటికే షూట్ చేసేశారట. ఈ విషయం ఆనోటా.. ఈనోటాపడి ఇటు ఫ్యాన్స్ చెవిలోపడటంతో.. ప్రభాస్ సినిమాలో ఆర్జీవీ (RGV)నా.. అంటూ నోరెళ్ల బెడుతున్నారట. ఇదిలా ఉంటే మారుతి సక్సెస్ ట్రాక్ రికార్డు ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మారుతి (Maruthi) చిత్రంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఓ పార్ట్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.
-
- ఏది ఏమైనా ఈ చిత్రంలో వర్మ (Varma) జాయిన్ అవడంతో మూవీకి కొత్త కోణాన్ని జోడించినట్లేనని చెప్పాలి. అదంతా ఒకెత్తయితే ఇప్పుడు ఆ సినిమాలో మన ఆర్జీవీ (RGV) క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందా అని అటు డార్లింగ్ ప్రభాస్ (Prabhas) అభిమానులతో ఇటు రామ్ గోపాల్ వర్మ అభిమానులు కూర్చున్నచోట ఉండలేకపోతున్నారట.
-
- అయితే ఈ సినిమా కోసం రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోలో వర్మ చేసే సీన్స్ కోసం సెట్ కూడా వేశారంటున్నాయి సినీ వర్గాలు. వర్మతో తీసిన సీన్స్ అంతబాగా రాలేదని.. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో వాటిని ఉంచాలావద్దా అనే విషయాన్ని ఆలోచిస్తున్నారట. ఆ విషయం ఎంత వరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. రాజా డీలక్స్ (Raja Deluxe) సినిమా అంతా కూడా హారర్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని వినికిడి. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి.
-
- ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుసగా 5 ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఓం రౌత్ (Om Raut)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె, అండ్ అలాగే సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రాల షూటింగ్స్ లో మన డార్లింగ్ బిజిబిజీగా గడుపుతున్నాడు.

Ehatv
Next Story