ఫిల్మ్‌నగర్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా వ్యూహం. ఈ సినిమాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని, ఓ సినీ ప్రముఖుడి క్యారెక్టర్లను ఓ ఆటాడేసుకున్నాడని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇంట్రడక్షన్ దగ్గర నుండి సినిమా ముగిసే వరకూ వ్యూహం సినిమాలో ఆ నాయకుల నిజ స్వరూపాలు ఇవి అని చెప్పడానికే దర్శకుడు టైమ్ ఎక్కువ తీసుకున్నాడు. ఇక మిగిలిన విషయాన్ని 'శపథం' సినిమాలో చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమా సక్సెస్ అయిందంటూ సక్సెస్ మీట్ పెట్టింది వ్యూహం చిత్ర యూనిట్. ఆ సక్సెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫిల్మ్‌నగర్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై సెటైర్లు వేశారు. జగన్ జైలు నుంచి వచ్చినట్టు.. నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయిందన్నారు వర్మ. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు.. మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారన్నారు ఆర్జీవీ. అసలు కంటెంట్ అంతా 'శపథం' సినిమాలో ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు. 'వ్యూహం' సినిమా 'శపథం' సినిమాకు ట్రైలర్ లాంటిదని హైప్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుందని.. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లకేనని అన్నారు రామ్ గోపాల్ వర్మ.

Updated On 2 March 2024 8:36 PM GMT
Yagnik

Yagnik

Next Story