Ram Gopal Varma : వాళ్లు బాత్రూమ్లో చూస్తారు ... వర్మ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను(AP Politics) బేస్ చేసుకుని సినిమాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని ఫైల్స్(Rajadhani files) అనే సినిమా విడుదలయ్యింది. ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagan) వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూలవర్గాలు తీసిన సినిమా ఇది! సినిమా ధబేల్‌మంది! ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ(Ram gopal varma) వంతు. ఆయన తీసిన వ్యూహం(Vyooham), శపథం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను(AP Politics) బేస్ చేసుకుని సినిమాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని ఫైల్స్(Rajadhani files) అనే సినిమా విడుదలయ్యింది. ముఖ్యమంత్రి జగన్‌కు(CM Jagan) వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూలవర్గాలు తీసిన సినిమా ఇది! సినిమా ధబేల్‌మంది! ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ(Ram gopal varma) వంతు. ఆయన తీసిన వ్యూహం(Vyooham), శపథం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. మామూలుగానే వర్మ పంచుల మీద పంచులేస్తుంటారు. అలాంటిది వ్యూహం, శపథం సినిమాల ఇంటర్వ్యూ అంటే పంచులు ఎలా పేలతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలను తెలుగుదేశం, జనసేన(Janasena) పార్టీల వాళ్లు చూస్తారా? అని కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారని వర్మ చెబుతూ సినిమాలు తీయడంలోని తన ఉద్దేశమేమిటో సూటిగా వివరించాడు. 'బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన తర్వాత ప్రత్యర్థిని గట్టిగా గుద్దాలి. అంతే తప్ప జుట్టు పీకుతా. చెంపగిల్లుతా. రక్కుతా అనే ఆటిట్యూడ్ ఉండకూడదు. అది నా ఫిలాసఫీ. వ్యూహం, శపథం సినిమాలతో నిజాలను బట్టలిప్పి చూపించడం అనేదే నా ఉద్దేశం. ఇక ఈ సినిమాను టీడీపీ, జనసేనవాళ్లు చూస్తారా అడుగుతున్నారు కదా! ఓ చిన్న ఎగ్జాంపుల్ చెబుతా.. సికింద్రాబాద్‌లో లంబా అనే థియేటర్ ఉంది. ఒకప్పుడు అందులో సెక్స్ సినిమాలు ఆడేవి. ఆ సినిమాలను చూడాలనే ఇష్టం ఉన్నా.. భయంతో చాలా మంది ఆ థియేటర్‌కు వెళ్లేవాళ్లు కాదు. కానీ, నా దృష్టిలో లంబా థియేటర్ చేసింది ప్రజాసేవ. నేను పోర్న్ చూసినట్టుగానే ఎవ్వరికీ తెలియకుండా టీడీపీ, జనసేన వాళ్లు బాత్రూమ్‌లలో కూర్చుని వ్యూహం, శపథం సినిమాలు చూస్తారు. న్యూట్రల్ వాళ్లు మాత్రం లివింగ్ రూంలో హాయిగా సినిమాలు చూసేయండి. ఫిబ్రవరి 23వ తేదీనవ్యూహం సినిమా, మార్చి 1వ తేదీన శపథం సినిమా రిలీజ్ అవుతున్నాయి. చూస్తే చూడండి లేకుంటే లేదు' అని వర్మ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ రాప్తాడు సిద్దం సభ వీడియోను వర్మ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. 'ఎండిపోయిన రాయలసీమలో సీఎం జగన్ సమావేశం కోసం జన సముద్రం కదిలి వచ్చింది. దేశంలోనే ఇప్పటివరకు ఇలాంటి జనసమీకరణ జరిగి ఉండకపోవచ్చు' అని వర్మ ట్వీట్ చేశారు.