ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram gopal varma) తీసిన వ్యూహం(Vyuham) సినిమా నిజానికి ఈ రోజు అంటే డిసెంబర్ 29వ తేదీన విడుదల కావాల్సి ఉండింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్(Censor Certificate) రద్దు చేయాలంటూ నారా లోకేశ్(Nara Lokesh) పిటిషన్ వేయడంతో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఓ వర్గం మీడియా మాత్రం సినిమా సెన్సార్ రద్దు చేశారంటూ కథనాలు రాస్తోంది.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram gopal varma) తీసిన వ్యూహం(Vyuham) సినిమా నిజానికి ఈ రోజు అంటే డిసెంబర్ 29వ తేదీన విడుదల కావాల్సి ఉండింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్(Censor Certificate) రద్దు చేయాలంటూ నారా లోకేశ్(Nara Lokesh) పిటిషన్ వేయడంతో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఓ వర్గం మీడియా మాత్రం సినిమా సెన్సార్ రద్దు చేశారంటూ కథనాలు రాస్తోంది. ఈ విషయంపై వర్మ ఓ క్లారిటీగా ఓ కౌంటర్ ఇచ్చారు. 'ఓ ఛానెల్‌కు సంబంధించిన వ్యక్తి, ఇంకా మరికొన్ని ఛానెల్స్ చెబుతున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదు. నిజమేమిటంటే కోర్టు సీబీఎఫ్‌సీ(CBFC) నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డు జనవరి 12లోపు సబ్మిట్ చేయమని అడిగారు' అని వర్మ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే వ్యూహం సెన్సార్‌కు సంబంధించిన వివాదం అంశం త్వరలో క్లియర్ అవుతుందనిపిస్తోంది.