బర్ఖా మదన్(Barkha Madhan) గుర్తున్నారా? ఒకప్పటి బ్యూటీఫుల్ హీరోయిన్. హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి. కొన్ని సినిమాలను నిర్మించారు కూడా! ఇంతే కాదు, ఆమె ఒక మోడల్, టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. కొన్ని టీవీ షోలను హోస్ట్ చేశారు. ఇంతటి విశేషమైన ప్రతిభ ఉన్న బర్ఖా బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలయ్యారు. సినిమా రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వాటన్నింటినీ వదిలిపెట్టేసి 2012 నవంబర్‌లో బౌద్ధ సన్యాసిగా(Buddhist monk) మారిపోయారు.

Barkha Madhan
బర్ఖా మదన్(Barkha Madhan) గుర్తున్నారా? ఒకప్పటి బ్యూటీఫుల్ హీరోయిన్. హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి. కొన్ని సినిమాలను నిర్మించారు కూడా! ఇంతే కాదు, ఆమె ఒక మోడల్, టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. కొన్ని టీవీ షోలను హోస్ట్ చేశారు. ఇంతటి విశేషమైన ప్రతిభ ఉన్న బర్ఖా బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలయ్యారు. సినిమా రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వాటన్నింటినీ వదిలిపెట్టేసి 2012 నవంబర్‌లో బౌద్ధ సన్యాసిగా(Buddhist monk) మారిపోయారు. తన పేరును వేం.గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చుకున్నారు. ఇప్పుడామె ఓ ఇండియన్ నన్. 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు బర్ఖా మదన్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సుస్మితా సేన్(sushmitha sen) విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్యరాయ్(aishwarya Rai) మొదటి రన్నరప్‌గా నిలిచారు.
బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికయ్యారు. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచారు. 1996లో అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ఖిలాడియోంకా ఖిలాడీ(Khiladiyon ka Khiladi) సినిమాతో బర్ఖా బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ఖిలాడీ సిరీస్‌లోని నాలుగో సీజన్‌లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. పాత్రల ఎంపికలో ఆమె ఎప్పుడూ రాజీ పడలేదు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకున్నారు. రామ్‌గోపాల్ వర్మ తీసిన భూత్(Bhooth) సినిమాలో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించారు. ఈ పాత్రతో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశారు. విమర్శకులను మెప్పించారు. సోచ్‌లో, సుర్ఖాబ్ వంటి రెండు సినిమాలను బర్ఖా నిర్మించారు. ఆమె బౌద్ధ గురువు దలైలామా అడుగు జాడలలో నడవాలని నిర్ణయించుకున్నప్పుడు సినీరంగం అవాక్కయ్యింది. 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించారు. సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు.
