దాదాపుగా పెళ్లైన 11 ఏళ్ళకు తల్లీ తండ్రులు కాబోతున్నారు రామ్ చరణ్ ఉపాసన. మరి ప్రెగ్నస్సీ ఇంత లేట్ గా అవ్వడానికి కారణం ఏంటీ..? ఈ విషయంలో ఉపాసన చెప్పిన కారణం ఏంటంటే..?టాలీవుడ్‌ (Tollywood) మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) -ఉపాసన (Upasana)తో కలిసి రొమాంటిక్ టూర్ లో ఉన్నాడు. ఈ ఏడాది రెండు బంపర్ ఆఫర్లు వారికి తగిలాయి. ఒకటి వారు తల్లీతండ్రులు అవ్వడం.. ఇంకొకటి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం.

దాదాపుగా పెళ్లైన 11 ఏళ్ళకు తల్లీ తండ్రులు కాబోతున్నారు రామ్ చరణ్ ఉపాసన. మరి ప్రెగ్నస్సీ ఇంత లేట్ గా అవ్వడానికి కారణం ఏంటీ..? ఈ విషయంలో ఉపాసన చెప్పిన కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌ (Tollywood) మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) -ఉపాసన (Upasana)తో కలిసి రొమాంటిక్ టూర్ లో ఉన్నాడు. ఈ ఏడాది రెండు బంపర్ ఆఫర్లు వారికి తగిలాయి. ఒకటి వారు తల్లీతండ్రులు అవ్వడం.. ఇంకొకటి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం. వివాహం అయిన పదకొండేళ్ళకు వీరు తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

అయితే ఇన్నిరోజులు సంతానం కోసం వారు ఎందుకు ఆగారు. ఇంత లేట్ గా సంతానం కలగడానికి కారణం ఏంటీ.. లేట్ ప్రెగ్నెన్సీపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు ఉపాసన. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన (Upasana) లేట్‌ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా తమకు నచ్చినప్పుడు పిల్లల్ని కనాలనుకున్నాం అని తెలిపారు.

ఇప్పుడు నేను చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నా. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నాకు ఇష్టమైనప్పుడే తల్లిని అవుతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సామాజిక ఒత్తిడికి లొంగకుండా మా నిర్ణాయానికి కట్టుబడి ఉన్నాం. ఇది మా పరస్పర నిర్ణయం. ఒక జంటగా.. బయట సమాజం నుంచి, మా కుటుంబం నుంచి మేము ఒత్తిడికి ఛాన్స్ ఇవ్వలేదు అన్నారు. ఇక పెళ్ళైన పదేళ్ళ తరువాత ఇప్పుడు మేం పిల్లల్ని కోరుకున్నాం. ఇదే మంచి సమయం అనిపించింది. ఇప్పుడు మేమిద్దరం ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా భద్రతతో ఉన్నాం. పిల్లల్ని చూసుకోగలం అని క్లారిటీ ఇచ్చింది ఉపాసన.

ఇక రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు దుబాయ్ లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మెగా కోడలిగా బాధ్యతను నిర్వహిస్తూనే అపోలో హాస్పిటల్స్ తో పాటు.. ఇతర బిజినెస్ లు.. సమాజసేవా కార్యక్రమాలతో బిజీగా ఉంది ఉపాసన. ఇక చరణ్ కూడా దుబాయ్ నుంచి వచ్చిన తరువాత శంకర్ మూవీని కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. రీసెంట్ గా ఈమూవీకి గేమ్ చేంజర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

Updated On 4 April 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story