మెగాపవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్(RRR Team).. కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi). అంతే కాదు ఆస్కార్(Oscar) సాధించిన జక్కన్న టీమ్(Jakkanna Team) ను ఘనంగా సన్మానించారు చిరంజీవి.

Ram Charan Birthday Celebrations
మెగాపవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్(RRR Team).. కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi). అంతే కాదు ఆస్కార్(Oscar) సాధించిన జక్కన్న టీమ్(Jakkanna Team) ను ఘనంగా సన్మానించారు చిరంజీవి.
నిన్న 38 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). అటు అభిమానులు.. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ చరణ్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ తరువాత వచ్చిన మెమరబుల్ బర్త్ డే కావడంతో.. చిరంజీవి కూడా ప్రస్టేజియస్ గా.. తన ఇంట్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు అతిథులుగా టాలీవుడ్ నుంచి స్టార్స్ అటెండ్ అయ్యారు. కింగ్ నాగార్జున దంపతులతో పాటు వారి తనయులు నాగచైతన్య, అఖిల్.. విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, సీనియర్ హీరో శ్రీకాంత్, అడవి శేష్, తో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ ఇందులో భాగస్వాములు అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చరణ్ బర్త్ డే వేడుకల సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ టీమ్.. సందడి చేసింది. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ గెలుచుకున్నా సందర్భంగా.. రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులను సన్మానించారు చిరంజీవి. వీరితో పాటు నిర్మాత దానయ్చ.. నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలబైరవాలను కూడా సన్మానించారు చిరు. వీరితో పాటు టీమ్ ను ముందుండి నడిపించిన కార్తికేయాను కూడా సన్మానించారు. చరణ్ బర్త్ డే పార్టీలో.. ఈస్టార్స్ అంతా కలిసి నిండుగా మారిపోయింది.
రామ్ చరణ్ 38వ పుట్టిన రోజుక సందర్భంగా సినిమా ఇండస్ట్రీనుంచే కాకుండా.. రాజకీయ నాయకుల నుంచి కూడా శుభాకాంక్షలు అందుకున్నారు రామ్ చరణ్. ఇటు ఫ్యాన్స్ కూడా చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహాంచారు. ఈసందర్భంగా ఆరెంజ్ మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. చరణ్ కెరీర్ లో ప్లాన్ గా నిలిచిన ఈ సినిమా.. రీ రిలీజ్ లో మాత్రం మంచి కలెక్షన్స్ ను సాధించింది సినిమా. ఇక ఈసినిమా రిలీజ్ వల్ల వచ్చిన కలెక్షైన్స్ ను జనసేన పార్టీకి ఫండ్ గా అందించారు నాగబాబు.
ఆస్కార్(Oscar) లో ఆర్ఆర్ఆర్ టీమ్ సత్తా చాటారు. నాటు నాటు పాట(natu Natu Song)కు ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్(Golden Globe Award) కూడా వరించింది. వీటితో పాటు హాలీవుడ్ క్రిటిక్ చాయిస్ అవార్డ్ తో పాటు మరికొన్ని అంతర్జాతీయ గౌరవాలను పొందింది మూవీ. అంతే కాదు ఈసినిమా హాలీవుడ్ మేకర్స్ మనసు దోచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామరూన్, స్పిల్ బర్గ్ నుంచి ప్రశసంలు దక్కాయి. ఈసినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు.
