చాలా కాలం బిజీ బిజీగా గడిపేశాడు రామ్ చరణ్(Ram Charan).. ఇక తన పర్సనల్ స్పేస్ కోసం కోంత కాలం షూటింగ్స్ కు విరామం ఇచ్చి.. ఉపాసనతో(Upasana) కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్..

చాలా కాలం బిజీ బిజీగా గడిపేశాడు రామ్ చరణ్(Ram Charan).. ఇక తన పర్సనల్ స్పేస్ కోసం కోంత కాలం షూటింగ్స్ కు విరామం ఇచ్చి.. ఉపాసనతో(Upasana) కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్..

ఓవైపు ఆర్ఆర్ఆర్(RRR) షూటింగ్.. ఆతరువాత సినిమా ప్రమోషన్లు.. ఆతరువాత శంకర్(Shankar) సినిమా షూటింగ్.. అది జరుగుతుండగానే.. ఆస్కార్(Oscar) కోసం ఆర్ఆర్ఆర్ హడావిడి.. విదేశీ ప్రయాణాలు..ఇలా తీరిక లేకుండా.. నిద్రాహారాలు మాని.. బిజీబిజీగా గడిపేశాడు రామ్ చరణ్. ఈ మధ్యలో ఉపాసన ప్రెగ్నంట్ అయినా కూడా.. తనతో టైమ్ స్పెండ్ చేయలేకపోయాడు.ఇక హడావిడి అంతా అయిపోవడంతో.. ఇక కొన్ని రోజులు పనికి విరామం తీసుకుని.. ఫ్యామిలీకి స్పేస్ఇచ్చాడు. తన భార్యను తీసుకుని విదేశాలకు ట్రిప్ కు బయలేదేరాడు.

ఈమధ్యే తమ స్పెషల్ ప్లైట్ లో.. దుబాయ్ వెళ్లి వచ్చారు రామ్ చరణ్ దంపతులు. అక్కడ ఉపాసనకు తన సిస్టర్స్ సీమంతం(Baby shower) కూడా చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్(Dubai) లో కొన్ని రోజులు గడిపి.. ఫ్యామిలీ టూర్ బాగా ఎంజాయ్ చేసిన రామ్ చరణ్, ఉపాసనలు.. రీసెంట్ గాహైదరాబాద్ వచ్చిరు. ఇక ఇద్దరు పర్సనల్ టూర్ ను ప్లాన్ చేసుకున్నారు. దాని కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ ప్లేస్ ను కూడా సెలక్ట్ చేసుకున్నారు. అది ఏదో కాదు.. మాల్దీవ్స్(Maldives).

లవర్స్ కు స్వర్గదామం లాంటి ఈ ప్లేస్ కు హైదరాబాద్ నుంచి బయలుదేరారు మెగా జంట. ఈ ఇద్దరు శంషాబాద్ నుంచి మాల్దీవ్స్ కు వెళ్తూ.. ఎయిర్ పోర్ట్ లో కెమెరాల కంటికి చిక్కారు. ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు జంట సందడి చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుబయ్ నుంచి రాగానే గేమ్ చేంజర్ షూటింగ్ లోకి రామ్ చరణ్ వెళ్ళిపోతాడు అనుకున్నారు అంతా.. కాని ఇప్పుడు మాల్దీవ్స్ ట్రిప్ ప్లాన్ చేశాడు చరణ్.

దాంతో గేమ్ చేంజర్ షూటింగ్ కు ఇంకొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు. అటు శంకర్ భారతీయుడు2(Indian @) షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డాడు. చరణ్ సమ్మర్ వెకేషన్(Summer vacation) ఎన్ని రోజులు ప్లాన్ చేశాడో తెలియదు కాని.. రాగానే శంకర్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు చరణ్. ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈసినిమాను త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈమూవీలో రామ్ చరణ్ జోడీగా కియార అద్వాని నటిస్తోంది. అంజలీ, శ్రీకాంత్, సునిల్, జయరామ్ లాంటి సీనియర్ స్టార్స్ ఈమూవీలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. హాలీవుడ్ డైరెక్టర్ల ప్రశంసలు కూడా పోందాడు. దాంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Updated On 10 April 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story