గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది.

Game Changer New Update
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు. శంకర్ సినిమాలో సహజంగా ఉండే సామాజిక సందేశం కూడా ఇందులో ఉంటుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైన కొత్త షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్‌ను(Action Scenes) తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్(KGF) ఫైట్ మాస్టర్(Fight Master) అన్బు అరివు(Anbu Arivu) నేతృత్వంలో ఈ ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు.
సినిమాకు ఇవే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం అంటోంది. ఇందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొనబోతున్నది. ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శక, నటుడు ఎస్.జె.సూర్య(S.J Surya), శ్రీకాంత్(Srikanth), అంజలి(anjali), సునీల్(suneel) కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు పిజ్జా, జిగార్తాండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కార్తిక్ సుబ్బరాజు కథ అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్‌చరణ్ చిత్రం అంటే దేశమంతటా క్రేజ్ ఉంది.
