గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కు చరణ్ హాజరయ్యాడు. అయితే ఈ క్రమంలో జపాన్ తనకు ప్రత్యేక స్థానాన్ని ఎలా కల్పించిందో చెప్పాడు.జపాన్ తనకు ఇష్టమైన ప్రదేశమని.. తన భార్య ఉపాసన (Upasana)తో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్రదేశంతో కనెక్షన్ ఉందని రివీల్ చేశాడు. తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కు చరణ్ హాజరయ్యాడు. అయితే ఈ క్రమంలో జపాన్ తనకు ప్రత్యేక స్థానాన్ని ఎలా కల్పించిందో చెప్పాడు.జపాన్ తనకు ఇష్టమైన ప్రదేశమని.. తన భార్య ఉపాసన (Upasana)తో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఈ ప్రదేశంతో కనెక్షన్ ఉందని రివీల్ చేశాడు. తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. జపాన్‌లోనే ఆ మ్యాజిక్ జరిగిందని (నవ్వుతూ) చెప్పాడు. ఇక రామ్ చరణ్‌కు ఏ దేశానికి వెళ్లినా అక్కడి కళాఖండాలను సేకరించే అలవాటు ఉంది. దీని గురించి ఆయన్ని అడిగితే అది తనకు ఎలా వచ్చిందో తెలియదన్నాడు. కానీ అది అర్ధవంతమైన సిటీగా ఉండి.. మళ్లీ వెళ్లినప్పుడు గుర్తుపట్టేలా ఉంటే కలెక్ట్ చేస్తానని చెప్పాడు. ఇక ఇష్టమైన ప్రదేశాల్లో యూరప్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుందని.. ఇప్పుడు జపాన్ కూడా ఆ లిస్టులో చేరిందని తెలిపాడు. అలాగే తనకు ఎందుకంత స్పెషలో కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
తన భార్య ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) ప్రస్తుతం గర్భవతి (ఏడవనెల) అని.. ఆ మ్యాజిక్ జపాన్‌లోనే జరిగిందని నవ్వుతూ చెప్పాడు. కాగా చరణ్, ఉపాసనతోపాటు ఆర్ఆర్ఆర్ (RRR) టీమ్ గతేడాది జపాన్‌లోనే పర్యటించింది. దాంతోపాటు అక్కడ ప్రదేశాలు చూడటానికి వారిద్దరూ టైమ్ స్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 12, 2022లో రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్త బయటకు వచ్చింది. అయితే ఈ విషయాన్ని చెర్రీ ఫ్యామిలీ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. కాగా పదేళ్ల వైవాహిక జీవితం తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. అందులో భాగంగానే బేబీమూన్, బేబీ షవర్ వంటి పార్టీలు ఆ దంపతులు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్ (Game Changer) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఆర్సీ 16 (RC16) చిత్రం తెరకెక్కనుంది.